ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లి రైతు కన్నీళ్లు

ABN, First Publish Date - 2020-08-12T10:31:25+05:30

ఉల్లి అమ్మకాలపై కరోనా ప్రభావం ప డింది. ఆశించిన మేర దిగుబడులు వచ్చి నా, వాటిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూతపడిన కొనుగోలు కేంద్రాలు 

భారీగా నిండిపోయిన నిల్వలు

మద్దతు ధర లేక ఆందోళనలో రైతులు


గద్వాల, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : ఉల్లి అమ్మకాలపై కరోనా ప్రభావం ప డింది. ఆశించిన మేర దిగుబడులు వచ్చి నా, వాటిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెం దాల్సి వస్తున్నది. దీనికితోడు ధరలు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో, కనీసం పెట్టుబడు లు కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయింది.


జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియో జకవర్గంలోని రాజోలి, వడ్డెపల్లి, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, అలంపూర్‌ మండలాల్లో రై తులు ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది దాదాపు నాలుగు వేల ఎకరాల్లో పంటను సాగు చేయగా, ఎకరానికి రూ.80 వేల పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి దాదాపు వంద క్వింటాళ్ల దిగుబ డులు వచ్చాయి. అయితే, ఉల్లిని హోల్‌సేల్‌ కేంద్రాలుగా ఉన్న కర్నూల్‌, హైదరాబాద్‌, తాడేపల్లిగూడం మార్కెట్లలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో అక్కడ కొనుగోళ్లను నిలిపి వేశారు. దీనికితోడు ప్రస్తుతం ఉల్లికి మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిపో యింది. మేలు రకం క్వింటాల్‌కు రూ.1,500, నాసిరకం ఉంటే క్విం టాల్‌కు రూ.500 ధర మాత్రమే పలుకుతున్నాయి. 


ఆదుకోవాలని విపతిపత్రాలు

జిల్లాలోని రాజోలి, పెద్దతాండ్రపాడు, తనగల, తుమ్మిళ్ల, ముళ్లదిన్నె, మాన్‌దొడ్డి, పెద్దధన్వాడ గ్రామాలకు చెందిన రైతులు రెండు రోజుల కిందట కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. గద్వాల వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటను కొ నుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. పది రోజుల కిందట మంత్రి నిరంజన్‌రెడ్డికి కూ డా వినతిపత్రం అందించారు. పెట్టుబడుల వచ్చే విధంగానైనా ప్రభు త్వం నుంచి ఆదుకోవాలని వినతిపత్రంలో కోరారు.

Updated Date - 2020-08-12T10:31:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising