ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లి రైతుకు ఊరట

ABN, First Publish Date - 2020-11-01T08:04:15+05:30

ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు ఉల్లి రైతు లను కోలుకోలేని దెబ్బతిశాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో ది గుబడులపై తీవ్ర ప్రభావం పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు

డిమాండ్‌ రావడంతో భారీగా పెరిగిన ధరలు

ఉన్న పంటను అమ్ముకుంటున్న రైతులు


గద్వాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు ఉల్లి రైతు లను కోలుకోలేని దెబ్బతిశాయి. పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు పడటంతో ది గుబడులపై తీవ్ర ప్రభావం పడింది.


జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నియోకవర్గంలో రైతులు ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేశారు. ఈ నియోజకవర్గంలోని అలంపూర్‌, వడ్డేపల్లి, ఉండవెల్లి, మా నవపాడు, రాజోలి మండలాల్లో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేపట్టారు. ఎకరానికి 80 క్వింటాళ్ల నుంచి వంద క్వింటాళ్ల వరకు దిగుబడులు రా వాల్సి ఉండగా, ఆగస్టు నుంచి అక్టోబరు వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు దాదాపు రెండు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొద్దిపాటిగా మిగిలిన పంటను చాలా మంది రైతులు వదిలేశారు. అయితే, పది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడం, కొద్దిపాటిగా ఎండకాయడంతో తడిగా ఉన్న భూమి పొడిగా మారింది. ఇదే సమయం లో ఉల్లి ధరలు పెరిగాయి. క్వింటాళ్‌ లోకల్‌ ఉల్లికి రూ.4 వేలు, తెల్ల ఉల్లికి రూ.5 వేలు, మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లికి రూ.7 వేల చొప్పున మార్కెట్‌ లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మిగిలి ఉన్న ఉల్లి సాగువైపు దృష్టి సా రించారు. విడిచి పెట్టిన ఉల్లిని, మళ్లీ భూమిల్లోంచి తీయిస్తున్నారు.


ఇందు కోసం కర్నూలు నుంచి కూలీలను పిలిపిస్తున్నారు. ఉల్లి సాగుతో నష్టపోయినా, కొద్దిపాటిగా ఉన్న పంటనైనా అమ్ముకుంటే పెట్టుబడులు వస్తాయనే ఆశలో రైతులు ఉన్నారు. భూమిల్లోంచి  తీసిన ఉల్లిని మళ్లీ గ్రేడింగ్‌ చేసి అరబోసి మార్కెట్‌కు తీసుకు వెళితే క్వింటాలుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధరలు పలికినా, ఎంతో కొంత నష్టం పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. 

Updated Date - 2020-11-01T08:04:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising