ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమాలపై అధికారుల విచారణ

ABN, First Publish Date - 2020-07-04T10:59:54+05:30

పాలమూరూ-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన బండరావిపాకుల, కొంకలపల్లిలో నివాసాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే క్రమంలో చోటు చేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాల్‌పేట, జులై 3 : పాలమూరూ-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన బండరావిపాకుల, కొంకలపల్లిలో నివాసాలు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే క్రమంలో చోటు చేసుకున్న అక్రమాలపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. బోగస్‌ పేర్లను సృష్టించి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు గతంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఈ విషయమై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ముగ్గురు తహసీల్దార్‌లతో కూడిన కమిటీని కలెక్టర్‌ ఏర్పాటు చేశారు.


ఆ కమిటీ సభ్యులు శుక్రవారం రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి సంబంధం లేని ఇతర గ్రామాల ప్రజలను లబ్ధిదారుల జాబితాలో చేర్చారని స్థానికులు తెలిపారు. 18 ఏళ్లు నిండని వారిని, చనిపోయిన వ్యక్తుల పేర్లను కూడా నమోదు చేశారని అధికారుల దృష్టికి తెచ్చారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Updated Date - 2020-07-04T10:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising