ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్సిడీలకు మంగళం

ABN, First Publish Date - 2020-12-16T03:51:40+05:30

రైతులకు పెట్టుబడి భారం కాకుండా కొంతమేర ఉపశమనంగా ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీలు ఇచ్చేది. గడిచిన వానాకాలం నుంచి ఈ సబ్సిడీలను నిలిపివేసింది.

విత్తనాలు వేస్తున్న కూలీలు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విత్తనాలపై వానాకాలం నుంచి సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం

వ్యవసాయ పనిముట్ల  కొనుగోళ్లపై కూడా..

మొత్తం ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆందోళన

వేరుశనగ విత్తనంపై యాసంగిలో రూ. 3300 అదనపు భారం

విత్తనాలు, పనిముట్లపై సబ్సిడీ కొనసాగించాలంటున్న రైతులు


వనపర్తి, డిసెంబరు 15, (ఆంధ్రజ్యోతి): రైతులకు పెట్టుబడి భారం కాకుండా కొంతమేర ఉపశమనంగా ప్రభుత్వం ప్రతీ సీజన్‌లో విత్తనాలు, వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీలు ఇచ్చేది. గడిచిన వానాకాలం నుంచి ఈ సబ్సిడీలను నిలిపివేసింది. దీంతో రైతులపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్లపై అదనపు భారం పడుతోంది. వానాకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా విత్తనాల అమ్మకాలపై కూడా ఆంక్షలు విధించింది. గతంలో ఆయా సీజన్‌లలో ప్రధానంగా సాగుచేసే పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేసేది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ లాంటి సంస్థల ద్వారా ఆ విత్తనాల్లో కొంతమేర రాయితీ ఇచ్చేది. కానీ, వానాకాలం నుంచి విత్తనాలపై ఇస్తున్న రాయితీని తీసివేసింది. దీంతో రైతులు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయ ఉపకరణాలపై గడిచిన కొన్ని సీజన్ల నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో రైతులపై తీవ్ర భారం పడుతోంది. పనిముట్లను బట్టి 50 శాతం వరకు గతంలో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు అవి ఇవ్వక పోవడంతో రైతులు ఉపకరణాలపై వెచ్చించాలంటే జంకుతున్నారు. గతంలో వెచ్చించిన దాని కంటే డబుల్‌ అవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన వానాకాలంలో అధికవర్షపాతం, చీడపీడల కారణంగా పంట దిగుబడులు అమాంతం పడిపోయాయి. కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో యాసంగి సాగు చేయడానికి రైతులు అవస్థలు పడుతున్నారు. పెట్టుబడి ఉపశమనం కోసం రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నప్పటికీ పడిపోతున్న దిగుబడుల కారణంగా నష్టాలే వస్తున్నాయని, సబ్సిడీలను పునరుద్ధరిస్తే మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. 


పనిముట్ల కొనుగోలు ఎలా?

వ్యవసాయ ఉప కరణాలతో పాటు యాంత్రీకరణ పథ కం కింద గతంలో ట్రాక్టర్లను ప్రభు త్వం అందజేసేది. ప్రస్తుతం ట్రాక్టర్ల పంపిణీ పూర్తిగా ని  లిచిపోగా వ్యవ సా య ఉపకరణాలపై కూడా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని నిలిపివేశారు. దీంతో అత్యంత అవసరమైన పనిముట్లను కూడా కొనుగోలు చేయడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నూర్పిడి సమయంలో ధాన్యం ఆరబోసే సమయంలో అత్యంత అవసరమైన టార్ఫాలిన్‌ కవర్లకు అసలు ధర రూ. 2500 ఉండగా గతంలో 50 శాతం ప్రభుత్వం భరించేది. మిగిలిన మొత్తం రైతు చెల్లించి కొనుగోలు చేసేవాడు. రోటవేటర్‌ ధర రూ. లక్ష ఉంటే సబ్సిడీ 50 శాతం ఉండేది. తైవాన్‌ స్ర్పేయర్‌ రూ. 18000 అసలు ధర ఉంటే 50 శాతం సబ్సిడీ వచ్చేది. మిగిలిన రూ. 9000 రైతులు చెల్లించేవారు. గుంటుక నాగళ్లు రూ. 26000 ఉంటే సబ్సిడీ 50 శాతం వచ్చేది. కేజీవీల్స్‌ రూ. 28000 ఉంటే సబ్సిడీ 50 శాతం ఉండేది. ప్రస్తుతం పైన పేర్కొన్న వాటిలో వేటికీ సబ్సిడీ రావడం లేదు. ప్రతీ సీజన్‌లో రైతుకు కచ్చితమైన పరికరాల విషయంలో సబ్సిడీలు ఎత్తివేయడంతో వారికి అదనపు భారం అవుతోంది. వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించడంతో పాటు ఉపకరణాలపై సబ్సిడీని కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.


గతంలో ఇలా..

విత్తనాలపై గతంలో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో సాగు జరిగే వరి విత్తనాలకు కూడా కొంతమేర సబ్సిడీ ఇచ్చేది. సన్నరకంలో బీపీటీ 5204 రకానికి బస్తాకు అసలు ధర రూ. 750 కాగా సబ్సిడీ రూ. 100 వరకు ఇచ్చేది. రూ. 650 రైతులు చెల్లించేవారు. ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (తెలంగాణ సోన) రకం బస్తా అసలు ధర రూ. 750 కాగా ప్రభుత్వం రూ. 250 వరకు సబ్సిడీ ఇచ్చేది. రూ. 500 రైతులు చెల్లించేవారు. దొడ్డు రకాల్లో కేఎన్‌ఎం 118 రకం బస్తాకు రూ. 785 ఉండగా రూ. 250 వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. రైతులు రూ. 535 చెల్లించేవారు. 1010 రకం బస్తాకు రూ. 785 ఉండగా ప్రభుత్వం రూ. 100 సబ్సిడీ రూపేన చెల్లించేది. రైతులు రూ. 685 చెల్లించేవారు. కందులు ఒక కేజీకి రూ. 70 ఉంటే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చేది. మిగతా 50 శాతం రైతులు చెల్లించేవారు. వేరుశనగ 100 కేజీలకు రూ. 8300 ధర ఉండగా రూ. 3300 ప్రభుత్వం సబ్సిడీ చెల్లించేది. రైతులు రూ. 5000 చెల్లించేవారు. అయితే ఈ సబ్సిడీలను ప్రభుత్వం నిలిపివేయడంతో మొత్తం ధరను రైతులే చెల్లించాల్సి వస్తోంది. పెద్ద రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నప్పటికీ చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఎత్తివేయడం భారంగానే నడుస్తోంది. వనపర్తి జిల్లాలో యాసంగిలో వేరుశగన అధికంగా సాగు అవుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేయడంతో ఒక్కో రైతుకు క్వింటాల్‌ వేరుశనగ కొనుగోలు చేయాలంటే రూ. 3300 అదనపు భారం అవుతోంది. పెరిగిన పెట్టుబడి, కూలీ రేట్లతో సత మతమవుతున్న రైతులను సబ్సిడీ పునరుద్ధరించి ఆదుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


రెండేళ్ల నుంచి ఇంతే 

రైతులకు అవస రమయ్యే వ్యవసా య ఉప కరణాలను గతంలో ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చేది. కా నీ, రెండేళ్లుగా ఆ సబ్సిడీపై ఉప కర ణాలు ఇవ్వడం నిలి పేసింది. సబ్సిడీ ఇచ్చినప్పుడు కనీసం సగం ధర భారం రైతులకు తక్కువ అవుతుండేది. ఇప్పుడు మొత్తం పెట్టి కొనుగోలు చేయాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఓవైపు ఆదుకోవడం మానేసి ఇచ్చే సబ్సిడీలను కూడా ఎత్తివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

- సాయిరెడ్డి, రైతు, కొత్తకోట వనపర్తి 


సబ్సిడీ బంద్‌ అయ్యింది 

గతంలో ప్రభు త్వం వేరుశనగ విత్త నాలను సరఫరా చే సేది. క్వింటాల్‌కు రూ.8300 వరకు ఉం టే రూ. 5000 వరకు చెల్లించేవాళ్లం. బయ ట అనంతపూర్‌ నుం చి తేవాలంటే సు మారు రూ. 10 వేలు ఖర్చు అయ్యేది. అందుకని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద తెచ్చుకు నేవాళ్లం. ఈసారి సరఫరా చేయకపోవడంతో అయిజ నుంచి విత్తనాలను తెప్పించాను. ఏడెకరాల వేరుశనగ వేశాను. కానీ, అధికవర్షాల వల్ల దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు అందిస్తే ఉపశమనంగా ఉండేది. 

- ఆంజనేయులు, వేరుశనగ రైతు, కేతేపల్లి, వనపర్తి 

Updated Date - 2020-12-16T03:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising