9న ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా సదస్సు
ABN, First Publish Date - 2020-11-03T10:23:02+05:30
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న ఎమ్మార్పీఎస్-టీఎస్ ఉమ్మడి జిల్లా సదస్సును నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన
పాలమూరు, నవంబరు 2: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9న ఎమ్మార్పీఎస్-టీఎస్ ఉమ్మడి జిల్లా సదస్సును నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కరపత్రం విడుదల చేసి, మాట్లాడారు. సదస్సుకు రాష్ట్ర, జాతీయ నాయకులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య హాజరవుతారని తెలిపారు. మాదిగలను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించి, న్యాయం చేయాలని, డప్పు, చెప్పు కళాకారులకు నెలకు రూ.2,000 పింఛన్ ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో ఎ.సురేష్, డి.రాజు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T10:23:02+05:30 IST