ప్రభుత్వ వైద్య కళాశాలలో వేడుకలు
ABN, First Publish Date - 2020-11-13T10:29:33+05:30
ప్రభుత్వ వైద్య కళాశాలలో 2020-21 సంవత్సరా నికిగాను ఐదో బ్యాచ్ ఎంబీబీఎస్ సీట్లు రెన్యువల్ చేసినందుకు కళాశాలలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపా ల్ డా. పుట్టా శ్రీనివాసులు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు.
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) నవంబర్ 12: ప్రభుత్వ వైద్య కళాశాలలో 2020-21 సంవత్సరా నికిగాను ఐదో బ్యాచ్ ఎంబీబీఎస్ సీట్లు రెన్యువల్ చేసినందుకు కళాశాలలో గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపా ల్ డా. పుట్టా శ్రీనివాసులు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఐదో బ్యాచ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వసతులు, బోధనా సిబ్బంది, ఆసు పత్రిలో పడకల పెంపుపై 2019 అక్టోబరు 2020 మార్చిలో ఎంసీఐ విజిట్ చేసి ఐదో బ్యాచ్ రెన్యు వల్‌కు అనుమతి ఇచ్చిందని తెలిపారు.
2021 మా ర్చి, ఏప్రిల్‌లో కళాశాల గుర్తింపు 150 ఎంబీబీఎస్, మరో 50 ఈడబ్ల్యూఎస్ కోటా కింద 50 సీట్ల చొప్పున మొత్తం 200 సీట్లకు ఎంసీఐకి ప్రతిపాదన లు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఆసుపత్రి సూపరింటెండెం ట్ డా.రాంకిషన్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సునందిని, ఆయా విభాగాధిపతులు పాల్గొన్నారు.
జనరల్ ఆసుపత్రిలో వైద్యులకు సన్మానం
ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉత్తమ సేవలందించిన పలువురు డాక్టర్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాంకిషన్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాల ను పణంగా పెట్టి రోగులకు వైద్య సేవలందిస్తు న్నారని, వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవ డం ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో వైద్యు లు నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఉత్తమ సేవలందించిన అసోసియేట్ ప్రొఫెసర్ డా. కేశవనాథ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. సందీప్, డా.రాగవేణిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డా. జీవన్, డా. నర్సింహారావు, ఆర్‌ఎంవోలు డా. విజయ్, డా. స్రవంతి, ఏవో శాభారాణి పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T10:29:33+05:30 IST