రైతులను నిలువునా ముంచిన కేసీఆర్
ABN, First Publish Date - 2020-11-13T10:27:18+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు పేరుతో రైతులను నిట్ట నిలువునా ముంచారని కాంగ్రెస్ నేతలు మండిప డ్డారు.
కలెక్టరేట్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు
మహబూబ్‌నగర్, నవంబరు 12: ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు పేరుతో రైతులను నిట్ట నిలువునా ముంచారని కాంగ్రెస్ నేతలు మండిప డ్డారు. మక్కలు సాగు చేయవద్దని, సన్న ధాన్యం పండిస్తే ప్రతి గింజను కుంటామని చెప్పిన ప్రభు త్వం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకపోవడం, మద్దతు ధర కల్పించకపోవడంతో రైతులంతా తీవ్ర నష్టాల్లో ఉన్నారని వాపోయారు. పంటలకు మద్ద తు ధర కల్పించాలంటూ గురువారం కాంగ్రెస్ పా ర్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముందుగా పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ గా కలెక్టరేట్ చేరుకొని కలెక్టరేట్ ముందు బైఠా యించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడారు.
సన్న ధాన్యానికి కేంద్రం రూ.1885 మద్దతు ధర ఇస్తు న్నందున రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.150 క్వింటా ల్‌కు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తుందని ముఖ్య మంత్రి ప్రకటన చేసి నెల రోజులవుతున్నా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. సన్న ధా న్యం సాగు చేయడం వల్ల ఎకరాకు పది బస్తాల దిగుబడి తగ్గిందని, సన్న రకాలకు విపరీతమైన తెగులు సోకడం వల్ల రైతులు చాలా వరకు నష్ట పోయారని, తీరా పండిన కొద్ది పంటను కూడా ప్ర భుత్వం కొనే పరిస్థితి లేదన్నారు. ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారని, రోజుల తరబడి నిరీక్షణ చేస్తున్నారని వాపోయారు. రైతులపై ప్రభు త్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2600 చెల్లించాలన్నారు. అదేవిధంగా వర్షాల కారణంగా పత్తి పంట పూర్తి గా దెబ్బతిన్నదని, ఎకరాకు క్వింటాల్ పత్తి కూడా పండలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
పండిన పం టను ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాల్‌కు రూ.7500 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకుంటున్నామని చెబుతూ రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. కార్యకమ్రంలో నాయకులు హర్షవర్ధ న్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్, ప్రదీప్‌గౌడ్, జి.మధుసూద న్‌రెడ్డి, బెక్కరి అనిత, సీజె బెనహర్, లక్ష్మణ్‌యా దవ్, జనార్దన్‌రెడ్డి, బాలవర్ధన్‌గౌడ్, సాయిబాబ, సిరాజ్‌ఖాద్రి, చంద్రశేఖర్, రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-13T10:27:18+05:30 IST