ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ

ABN, First Publish Date - 2020-03-13T10:56:47+05:30

నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్‌ విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రెండు రోజులుగా కొనసాగుతున్న తనిఖీలు,  

- జిల్లా పంచాయతీ కార్యాలయంలో రికార్డుల పరిశీలన


గద్వాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : గట్టు పంచాయ తీలో నిధుల దుర్వినియోగంపై పంచాయతీరాజ్‌ శాఖ విజిలెన్‌ బృందాలు రెండు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. గతంలో పని చేసిన సర్పంచి సంతోషమ్మ నిరక్షరాస్యులు కావడంతో ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు, కొందరు నాయకులు కలిసి దాదాపు రూ.30 లక్షల నుంచి  రూ.40 లక్షల మేరకు నిధులను దుర్వినియోగం చేశారు. ఈ విషయం పై గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు విజిలెన్స్‌ అధికారు లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ అధికారులు రికార్డులను సీజ్‌ చేసి విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగంలో కార్యదర్శులు కొందరు నాయకులతో చేతులు కలిసి నిధులు కాజేశారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ నిర్వహించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ మాట్లాడారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ నిమిత్తం రికార్డులను తయారుచేశామని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కార్యదర్శులను రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-03-13T10:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising