ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-16T03:53:23+05:30

ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి చెం దిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలకపల్లి, డిసెంబరు 15 : ద్విచక్ర వాహనం బోల్తా పడి వ్యక్తి మృతి చెం దిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక హెడ్‌కానిస్టేబుల్‌ జి.వెంకటేశ్వర్లు అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్నముద్దునూర్‌ గ్రామానికి చెందిన కనుకు లక్ష్మయ్య(65)సోమవారం రాత్రి తన పొలంలో వేసిన వేరుశనగ పంట కావలి కోసం పొలం దగ్గరికి వెళ్తుండగా, గ్రామ శివారులోని శ్రీమాత దేవాలయం దగ్గర ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి బోల్తా పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వెంటనే ప్రమాదం గమనించిన స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు. మంగళవారం మృతుని కుమారుడు కునుకు జగదీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ జి.వెంకటేశ్వర్లు తెలిపారు.  



Updated Date - 2020-12-16T03:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising