ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుల పండువగా రథోత్సవం

ABN, First Publish Date - 2021-01-01T04:03:55+05:30

మల్దకల్‌ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి రథోత్సవం కన్నుల పండువగా సాగింది.

నైవేద్యం కోసం దాసంగాలను సిద్ధం చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కొనసాగుతున్న మల్దకల్‌ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 

    మల్దకల్‌, డిసెంబరు 31 : మల్దకల్‌ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. మామిడి తోరణాలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు పురవీధులలో ఊరేగారు. ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన రథోత్సవం దేవాలయం నుంచి దశిమికట్ట వరకు వైభవంగా కొనసాగింది. తెల్లవారుజామున రథం తిరిగి ఆలయానికి చేరుకున్నది. ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, ఏఎస్పీ కృష్ణ, సీఐ హనుమంతు బందోబస్తును పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో గురువారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల మూడు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్న రైతుసంబురాల కరపత్రాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు విడుదల చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ సుబాన్‌, మల్దకల్‌ ఎంపీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, సర్పంచు యాకోబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-01T04:03:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising