నేడు కురుమూర్తి వెంకన్న అలంకారోత్సవం
ABN, First Publish Date - 2020-11-19T04:06:41+05:30
రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
చిన్నచింతకుంట, నవంబరు 18 : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారి అలంకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అలంకారోత్సవంలో భాగంగా ప్రతి ఏటా వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లోని ఎస్‌బీహెచ్ నుంచి స్వామి వారి ఆభరణాలు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ ఏడాది కొవిడ్-19 నిబంధనల మేరకు ఊరేగింపు నిర్వహించరాదని అధికారులు నిర్ణయించారు. ఎస్‌బీహెచ్ లాకర్‌లోంచి ఆభరణాలు తీసి, వాటికి అర్చకులు, వేద పండితులు, ఉన్నతాదికారుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి కొత్తపల్లి, దుప్పలి మీదుగా అమ్మాపురం గ్రామంలోని ముక్కెర వంశపు సంస్థానాధీశుల నివాసంలో ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం జాతర మైదానానికి తీసుకొచ్చిన అనంతరం, రాత్రికి స్వామి వారికి వాటిని అలంకరిస్తారు. అలాగే ఆలయానికి కూడా భక్తులు పరిమిత సంఖ్యలో రావాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - 2020-11-19T04:06:41+05:30 IST