ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు

ABN, First Publish Date - 2020-11-30T03:51:12+05:30

శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఆది వారం మండల ప్రజలు తమ తమ ఇళ్లల్లో కార్తీక దీపాలను వెలగించి భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూసాపేట, నవంబరు 29 : శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఆది వారం మండల ప్రజలు తమ తమ ఇళ్లల్లో కార్తీక దీపాలను వెలగించి భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలను జరుపుకున్నారు.

ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్లు కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్లల్లో కేదారేశ్వరి నోము వ్రతాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మండల ప్రజలు సుచి శుభ్రతతో ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలగించి తమ మొక్కులను చెల్లించుకున్నారు.


గండీడ్‌ మండలంలో 


గండీడ్‌ : కార్తీకామాసం సందర్భంగా మండలంలో ప్రజలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఇళ్లల్లో గౌరీ, లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. దేవాలయాల్లో మహిళలు దీపాలను వెలిగించి వారి మొక్కులను తీర్చుకున్నారు. మండలంలోని మహ్మదాబాద్‌, నంచర్ల, గండీడ్‌, వెన్నాచెడ్‌, రుసుంపల్లి, గాధిర్యాల్‌, కొంరెడ్డిపల్లి, మొకార్లబాద్‌, వెంకట్‌రెడ్డిపల్లి, రంగారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో జరుపుకున్నారు.

Updated Date - 2020-11-30T03:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising