ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెడదోవ..గుప్పుమంటున్న గంజాయి

ABN, First Publish Date - 2020-09-14T10:45:57+05:30

యువత మత్తుకు బానిసవుతోంది. సంస్కృతి పెడదోవపడుతోం ది. మద్యం, సిగరెట్‌ల కంటే ఎక్కువ కిక్కు ఇచ్చే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుక్కాకు అలవాటుపడుతున్న యువత

ఒక్కో ఫ్లేవర్‌కు ఒక్కో కిక్కు

మత్తులో చిత్తవుతున్న భావితరం

జడ్చర్ల, పాలమూరుకు పాకిన సంస్కృతి


మహబూబ్‌నగర్‌/జడ్చర్ల, సెప్టెంబరు 13: యువత మత్తుకు బానిసవుతోంది. సంస్కృతి పెడదోవపడుతోం ది. మద్యం, సిగరెట్‌ల కంటే ఎక్కువ కిక్కు ఇచ్చే పదార్థాల వైపు అడుగులు పడుతున్నాయి. నగరాలకే పరిమితమైన విష సంస్కృతి ఇప్పుడు పట్టణాలు, పల్లెలను తాకుతోంది. మార కద్రవ్యాలు వాడుతూ మత్తులో యువత, నడి వయస్కులు చిత్తవుతు న్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ని పలు పట్టణాల్లో గంజాయి గుప్పు మంటుండగా, హుక్కా సంస్కృతి రోజురోజుకూ పెరుగుతోంది. మాస్‌ గంజాయి వైపు మొగ్గుతుండగా, చదువుకున్న యువత హుక్కాతో గమ్మత్తుగా ఫీలవుతున్నారు. సిగరెట్‌ కన్నా ఎక్కువ మత్తు కావాలని కోరుకునేవారు సిగరె ట్‌లోని పొగాకును తీసేసి అందులో గంజా యి ఆకు పొడిని నింపి పీలుస్తూ మత్తు పొందు తున్నారు. పాలమూరు, జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌, గద్వాల పట్టణాల్లో గంజాయి వాడకం ఎక్కువగా ఉంటోంది.


రకరకాల ప్లేవర్‌లలో హుక్కా..

హుక్కా అనేది ఒకప్పుడు పెద్దపెద్ద నగరాలకే పరిమ తమయ్యేది. ఇప్పుడు పట్టణాలకూ ఈ సంస్కృతి పాకిం ది. హుక్కాను సిగరెట్‌ తరహాలో నే పీలుస్తుంటారు. ఇందులో రకరకాల ఫ్లేవర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. హుక్కా పాట్‌లో 30-50 ఎంఎల్‌ ఫ్లేవర్‌ను పోసి ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు ఒకేసారి పీల్చేలా పైపులను ఏర్పాటు చేసుకుంటారు. ఒక ఫ్లేవర్‌ను గంటపాటు సేవించే అవకాశం ఉంటుంది. పాలమూరుతో పాటు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న జడ్చర్ల పట్టణంలో ఈ సంస్కృతి పెరిగిపోతోంది. జడ్చర్ల పరిసరాల్లో పరిశ్రమ లు, సెజ్‌, కళాశాలలు వెలువడడం వల్ల ఇతర రాష్ట్రా ల కు చెందిన విద్యార్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో నివాసం ఉండటం వల్ల అడ్వాన్స్‌ కల్చర్‌ పెరిగిపోతోంది. ఈ క్ర మంలో హుక్కాను ఎక్కువగా తీసుకుంటున్నారు. జడ్చ ర్లతోపాటు పాలమూరు, వనపర్తి, నారాయణపేట పట్ట ణాలకు హుక్కా కల్చర్ల పాకుతోంది. రకరకాల ఫ్లేవర్‌ లు అందుబాటులో ఉంటున్నాయి.


ఆపిల్‌, వెనీల, డబుల్‌ ఆపిల్‌, చాక్‌లెట్‌, ఫైనాపిల్‌, వాటర్‌మిలాన్‌ వంటి ఫ్లేవర్‌లు వినియోగిస్తున్నారు. ఒక సిగరెట్‌ను ఒక్కరే తాగే అవకాశం ఉంటుంది. అయితే హుక్కా మాత్రం ఇద్దరు నుంచి నలుగురు ఒకేసారి షేర్‌ చేసు కొని ముచ్చట్లు పెడుతూ తీసుకోవడం వల్ల ఎక్కువ మజాను పొందుతున్నారు. వీటి ధర రూ.100-500 వర కు ఉంటుంది. ఒక పాట్‌కు ముగ్గురు నలుగురు కూ ర్చుంటే గంట వరకు పఫ్‌ చేయవచ్చు.. సిగరేట్‌, గంజా యి తరహాలో హుక్కా వాసన ఉండదు. ఈ ఫ్లెవర్‌ల స్మెల్‌ పక్క గదికి కూడా వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ఎవరూ గుర్తించే అవకాశం ఉండదు. అందుకే ఎక్కువ మంది ఇటువైపు ఆకర్శితులవుతున్నారు. యూ త్‌, స్టూడెంట్స్‌ ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ ఎక్కు వగా వినియోగిస్తున్నట్టు సమాచారం.


గంజాయి మత్తులో యువత

హుక్కాతోపాటు గంజాయి మత్తులో యువత చిత్తవు తోంది. పాలమూరు పట్ణణంలోని కొత్తగంజి, రైల్వేస్టేషన్‌, కొత్త చెరువురోడ్‌, న్యూటౌన్‌, షాషాబ్‌గుట్ట, శ్రీనివాసకా లనీతోపాటు శివారు ప్రాంతాలలో యువత గంజాయిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో నిర్వహించిన పోలీసు ప్రజాదర్బార్‌లోనూ పలువురు గంజాయి గురిం చి ఫిర్యాదులు చేశారు. పలుచోట్ల గంజాయిని పట్టుకున్న కేసులు కూడా ఉన్నాయి. మాస్‌ పీపుల్‌ ఎక్కువగా గం జాయి బారిన పడుతున్నారు. ఫోన్‌ల ద్వారానే కస్టమర్ల కు గంజాయి పౌడర్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అడ్డాలు ఉన్నాయి.


ఆయా అడ్డాలలో రాళ్ల కింద వీటిని ఉంచితే తాగేవారు అక్కడికి వెళ్లి ఆ పౌడర్‌ను తీసుకొని వెళతారు. నిర్మానుష్య ప్రాంతాలైన మైదానాలు, శివారు ప్రాంతాల్లోని చెట్ల పొదలు, గుట్టలకు వెళ్లి గంజాయిని సిగకోట్‌ తరహాలోనే తాగడం వల్ల ప్రత్యేకంగా గంజాయి తాగే వారిని గుర్తుపట్టే అవకాశం లేకుండా పోతోంది. పట్టణంతోపాటు జడ్చర్లలో నూ గంజాయి బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు స్పందిస్తున్నా ఆ తరువాత వాటి జోలికి వెళ్లకపోవడంతో యువత పెడదోవ పడుతోంది. 

Updated Date - 2020-09-14T10:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising