ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-02-28T11:21:39+05:30

వచ్చే నెల నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి ఎం.హృదయరాజు సిబ్బందికి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా ఇంటర్‌ విద్యాధికారి హృదయరాజు



గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 27 : వచ్చే నెల నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి ఎం.హృదయరాజు సిబ్బందికి సూచించారు.   బాధ్యులైన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్లలో భద్రపరచిన ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు  తీసుకొచ్చేందుకు, జవాబు పత్రాలను పోస్టాఫీసులో అందించేందుకు విధిగా ఎస్కార్ట్‌తో వెళ్లాలని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లు గంట ముందుగానే పరీక్షా కేంద్రా నికి చేరుకోవాలని, అందుకు చీప్‌ సూపరిం టెండెంట్‌లదే బాధ్యత అన్నారు. 


పరీక్షకు హజరయ్యే విద్యార్థులు నిర్ణయించిన సమయం కంటే ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించ వద్దని సూచించారు. ఎవరూ నిబంధనను ఉల్లంఘించవద్దని, ఇందుకు మీరే బాధ్యత వహిస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిస్ర్టిక్‌ ఎగ్జామ్‌ కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్‌లు వీరన్న, పద్మలత, బండ్ల దేవేంద ర్‌రెడ్డి, కృష్ణ, రమేష్‌లింగం, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising