ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం

ABN, First Publish Date - 2020-12-14T03:19:30+05:30

విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బోమ్మరాజుపల్లి పరిధిలోని బుర్గువానికుంట తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది.

బుర్గువానికుంట తండాలో దగ్ధమైన ఇల్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊర్కొండ, డిసెంబరు 13: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని బోమ్మరాజుపల్లి పరిధిలోని బుర్గువానికుంట తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేనావత్‌ పాండునాయక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి విద్యుదాఘాతంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో ఉన్న బీరువా, టీవీ, దుస్తులతో పాటు, డబ్బులు, బియ్యం పూర్తిగా మంటల్లో కాలి బూడిద కాగా, రూ.లక్ష ఆస్తినష్టం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబం కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.   


కంసానిపల్లిలో గుడిసె..

 ఉప్పునుంతల: మండల పరిఽఽఽఽఽధిలోని కంసానిపల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో  కలమండల లక్ష్మయ్యకు చెందిన గుడిసె దగ్ధం అయినట్లు గ్రామస్ధులు తెలిపారు. మంటలలో నిత్యావస సరుకులతో పాటు బట్టలు, వంట సామాగ్రి పూర్తిగా దగ్ధం అయిన్నట్లు బాధితులతో పాటు గ్రామస్ధులు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ లక్ష్మీనారాయణ,  ఉపసర్పంచ్‌ లింగమయ్య,  నాయకులు రేణయ్య, సాయిబాబు, రామస్వామి, శ్రీను తదితరులు కోరారు.

Updated Date - 2020-12-14T03:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising