ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్కార్‌ ఆస్పత్రికి సమస్యల సుస్తి

ABN, First Publish Date - 2020-02-20T06:11:21+05:30

జిల్లా ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగు లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీ స సదుపాయలు కూడా కరువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాలక్రైం, ఫిబ్రవరి 19: జిల్లా ఆసుపత్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగు లు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీ స సదుపాయలు కూడా కరువయ్యాయి. ఆస్పత్రిలోని విద్యుత్‌ప్యానెల్‌ బోర్డు కాలిపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. బోర్డు కాలిపోయినప్పుడల్లా తాత్కాలిక మరమ్మతులు చేస్తు న్నారే తప్ప శాశ్వతంగా పరిష్కరించడం లేదు. నీరు లేకపో వడంతో బయట కొంటున్నామని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఆసుపత్రి ఆవరణలో దాతలు ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌లు నీరు లేక నిరుపయోగంగా మారా యి.  జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా ఆసుపత్రి పరిస్థితే ఇలా ఉంటే మండలాల్లోని ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  


 మూత్రశాలలు లేక ఇబ్బందులు

జిల్లా ఆసుపత్రిలో అతి ప్రధాన సమస్యలలో టాయిలెట్స్‌ సమస్య ఒకటి. ఆసుపత్రిలో  మూత్రశాలలు లేక ఇన్‌పెషంట్లతో పాటు అవుట్‌ పేషంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోగులు సైతం బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెల కొంది. యూరిన్‌ టెస్ట్‌ కోసం కూడా రోగులు బహిర్భుమికి వెళ్లాల్సి వస్తుందని బంధువులు వాపోతున్నారు. 

హైఓల్టేజీతో కాలిన డయాలసిస్‌ మిషన్లు 

జిల్లాలో దాదాపు 400 మంది దాకా డయాలసిస్‌ రోగులు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రిలో విద్యుత్‌ హైఓల్టేజీతో జిల్లా ఆసుపత్రిలో ఉన్న 9 డయాలసిస్‌ మిషన్‌లలో 5 డయాలసిస్‌ మిషన్‌లు మరమ్మతుకు గురయ్యాయి. సర్క్యూర్‌బోర్డు, బ్రేకర్‌ కాలిపోవడంతో ఐదు మిషన్లు పనిచేయడం లేదు. దీంతో డయాలసిస్‌ చేయించుకోవడానికి వచ్చే రోగులను మహబూబ్‌నగర్‌, వనపర్తికి తరలిస్తున్నట్లు డయాలిసిస్‌ ఇన్‌చార్జి రాజేష్‌ తెలిపారు. 

సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ఆసుపత్రిలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. మంచినీటి సమస్య తీరాలంటే ప్యానెల్‌ బోర్డు మరమ్మతు లో ఉంది. కొత్తది కావాలంటే దాదాపు రూ.12.30 లక్షల దాకా కావాలని అఽ దికారులకు చెప్పాము. తాత్కాలికంగా మరమ్మతులు చేయించి నీటి సమస్య ను పరిష్కరిస్తాం. మూత్రశాలల సమస్య ఉన్నమాట వాస్తవమే. ఆసుపత్రిలోని వార్డులలో ఉన్న బాత్‌రూంలలో కూడా డ్రెయినేజీ పైపుల వల్ల ఈ సమస్య తలెత్తింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమస్యను పరిష్కరించేలా చూస్తాం.

- నవీన్‌క్రాంతి, ఆసుపత్రి సూపరిండెంట్‌, గద్వాల 


నీళ్లు కొంటున్నాము: వెంకటేశ్వరమ్మ, భీంపురం.

జిల్లా ఆసుపత్రిలో నీటి సమస్య ఉండటంతో బయట నుంచి వాటర్‌ బాటిళ్లు కొంటున్నాము. జిల్లా ఆసుపత్రిలో నీటి సమస్య ఇంత ఎక్కువగా ఉండటం ఎప్పుడు చూడలేదు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి.


మరో రెండు రోజులు పట్టవచ్చు 

డయాలసిస్‌ మిషన్ల లోపలి భాగాలు కాలిపోయాయి.  హైదరాబాద్‌ నుంచి మెకానిక్‌ రావాల్చి ఉంది.   రెండు రోజుల్లో మిషన్‌లను బాగు చేయిస్తాం.

- రాజేష్‌, డయాలిసిస్‌ ఇన్‌చార్జి, గద్వాల 

Updated Date - 2020-02-20T06:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising