ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దంచికొట్టిన వాన.. భారీ వర్షాలకు తెగిన కాలువలు

ABN, First Publish Date - 2020-08-03T17:41:25+05:30

మరోసారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. శనివారం అర్దరాత్రి తర్వాత జిల్లాలో వాన దంచికొట్టింది. ముఖ్యంగా పెబ్బేరు మండలంలో రికార్డుస్థాయిలో 156.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పాన్‌గల్‌ మండలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెబ్బేరులో  అత్యధికంగా 156.3 మిల్లీ మీటర్ల వర్షం  

పలుచోట్ల పొంగిపొర్లిన వాగులు

నీట మునిగిన పంటపొలాలు


వనపర్తి కలెక్టరేట్‌(మహబూబ్ నగర్) : మరోసారి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. శనివారం అర్దరాత్రి తర్వాత జిల్లాలో వాన దంచికొట్టింది. ముఖ్యంగా పెబ్బేరు మండలంలో రికార్డుస్థాయిలో 156.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పాన్‌గల్‌ మండలంలో సైతం 141.5 మి.మీ వాన పడగా శ్రీరం గాపురంలో118.5, కొత్తకోట  85.3, పెద్దమందడి  76.5, ఘనపురం  66.3, చి న్నంబావి 64.0, వీపనగండ్ల  43.5, వనపర్తి  43.0, రేవల్లి  39.5, ఆత్మకూరు  34.8, మదనాపురం - 30.8, గోపాల్‌పేట మండలంలో 20.0 మి.మీ వర్షపాతం నమోదయింది.. భారీ వర్షానికి పాన్‌గల్‌, పెద్దమందడి, కొత్తకోట, వీపనగండ్ల మండలాలలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.  


భారీ వర్షాలకు తెగిన కాలువలు 

కొత్తకోట మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కాలువలు తెగిపోయాయి.  ఆదివారం పొలాల వద్దకు వెళ్లిన రైతులకు నీళ్లు తప్ప పం టలు కనబడక పోవడంతో ఖంగుతున్నారు. రాయనిపేటతో పాటు ఇతర గ్రా మాల్లో వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు దిగువకు వరదగా రావడంతో కాలువలు తెగిపోయాయి. వరి పొలాలు నీటిలో మునగడంతోపాటు ఇసుక మేటలు పెట్టాయి. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి రైతులు పాండురంగయ్య యాదవ్‌, శివ, సంపత్‌కుమార్‌రెడ్డి, వెంట పెట్టుకోని నీట మునిగిన పొలాలను పరిశీలించారు.  


భీమా కాల్వకు గండి

పాన్‌గల్‌/ వీపనగండ్ల/ పెబ్బేరు:  మండలంలోని మహ్మదాపూర్‌ , కొత్తపేట, కేతేపల్లి, జమ్మాపూర్‌, గ్రామాల్లో చెరువులు , కుంటలు అలుగులు పారడంతో నీరు భీమా కాల్వలోకి చేరి కాల్వ ఎక్కి పారడంతో పాటు  గండి పడి పంట చేలు నీటమునిగాయి. అధికారులు నిర్లక్ష్యం కారణంగానే పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీపనగండ్ల మండలంలోని గోవర్దనగిరి, వీపనగండ్ల గ్రామాల మధ్య గోపల్‌దిన్నె రిజ ర్వాయర్‌ అలుగు  నీటితో కల్వర్టుపై అధికంగా నీరు ప్రవహించడంతో రాకపో కలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పంటపొలాలు  కోతకు గురయ్యాయి.   పెబ్బేరు మండలం మహబూబ్‌పాల్‌ సముద్రం చెరువు అలుగు పారడంతో కృష్ణనదికి వర్షం నీరు భారీగా వెళ్ళింది.  ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ ఆవరణ భారీగా వర్షం నీరు చేరి చెరువును తలపిస్తుంది. రైతులు అక్కడక్కడ వేసిన వరి నాట్లు వర్షానికి కొట్టుకుపోయాయి. పెబ్బేరులో  రోడ్డు పనులు  జరుగు తుండడంతో వ ర్షం నీరులో రోడ్డు కనిపించక ఆర్టీసీ బస్సు ఇరుక్కుంది.

Updated Date - 2020-08-03T17:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising