ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2020-12-02T03:51:05+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్‌గౌడ్‌ అన్నారు.

ధర్నా చేస్తున్న సీపీఐ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 1 : కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దుచేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్‌గౌడ్‌ అన్నారు. సీపీఐ- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులపై జరుగు తున్న దమనకాండను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రం లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ కార్పొరేట్‌ రంగాలను వ్యవసాయరంగాన్ని కట్టబెట్టేందుకు మోదీ సర్కార్‌ కుట్ర చేస్తోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు కట్టబెట్టే ప్రయత్నాలను విర మించుకోవాలన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపే ప్రభు త్వంగా మోదీ సర్కార్‌ పేరు తెచ్చుకుందన్నారు. ఢిల్లీలో  మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే మోదీ ప్రభుత్వం వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం దారుణమని పే ర్కొన్నారు. వెంటనే కేంద్రం రైతువ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్వాల్‌రెడ్డి, చిన్న, మునియప్ప, వెంకటయ్య, భీమయ్య, అచ్చన్న, రాములు, దేవమ్మ, నర్సమ్మ, యాదయ్య, రాజు, నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు. 


రైతుల పోరాటానికి మద్దతుగా దీక్షలు


ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజాసంఘాలు దీక్షలు చేపట్టాయి. మంగళవారం తెలంగాణ చౌరస్తాలో దీక్షలు చేపట్టారు. ఈ కా ర్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రాములు, సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి కురు మయ్య, రైతుసంఘం జిల్లా అఽధ్యక్షుడు లక్ష్మయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ నేత కావలి కృష్ణయ్య పాల్గొనన్నారు.


అధికారపార్టీ నాయకులు సిఫారుచేసిన వారి ధాన్యమే కొంటారా ? 


జడ్చర్ల : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారపార్టీ నాయకులు సిఫారు చేసిన రైతుల ధాన్యమే కొనుగోలు చేస్తారా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదేపల్లి పత్తి మార్కెట్‌లో బాదేపల్లి సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. వరిధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి పత్తిమార్కెట్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్ప డిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధమైన ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు అధికారపార్టీ నాయకులు సిఫారసు చేస్తే కొనుగోలు చేయడం ఎంత వరకు సరైందిందంటూ నిలదీసారు. వరిధాన్యం కొనుగోలు చేస్తామని బాదేపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వెల్లడించడంతో రైతులు శాంతించారు. 

Updated Date - 2020-12-02T03:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising