ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రభుత్వం దోపిడీ

ABN, First Publish Date - 2020-12-20T03:57:10+05:30

ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజల నుంచి రూ.లక్ష కోట్ల దోపిడీకి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అఖిలపక్ష నాయకులు పేర్కొ న్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.

కోస్గి శివాజీ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న అఖిలపక్షం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కోస్గిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో

- రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని హెచ్చరిక



కోస్గి, డిసెంబరు 19 : ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజల నుంచి రూ.లక్ష కోట్ల దోపిడీకి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని అఖిలపక్ష నాయకులు పేర్కొ న్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. శనివారం పట్టణంలోని శివాజీ చౌరస్తాలో మహబూబ్‌నగర్‌-తాండూర్‌ ప్రధాన రహదారిపై కాం గ్రెస్‌, టీడీపీ, బీజేపీ, సీపీఐ, వైఎస్‌ఆర్‌ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు వార్ల విజయకుమార్‌, నాగులపల్లి నరేందర్‌, బంటు రమేష్‌, కోటకోండ రాము, డీకే రాములు, తమ్మళి బాల రాజు, పోకల లక్ష్మణ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్లుగా నిరంకుశ పరిపాలన చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ చట్టాన్ని పెట్టి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ చట్టాన్ని వెంటనే విరమిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ రాంకోటికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయ కులు రఘువర్ధన్‌రెడ్డి, వెంకట్‌ రాములు, తుడుం శ్రీనివాస్‌, ఇద్రిస్‌, భానునాయక్‌, బెజ్జు రాములు, నాగులపల్లి నర్సిములు, సలీం, హజీ, రహీంపాషా, పోలేపల్లి నర్సింహ్మ, నారాయణ, సిబి వెంకటేష్‌, కిరణ్‌ కుమార్‌, వెంకట్‌రాములు, శ్రీకాంత్‌గౌడ్‌, అచ్యుతారెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-12-20T03:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising