ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులూ.. టీఆర్‌ఎస్‌లో పని చేయండి

ABN, First Publish Date - 2020-12-30T04:04:10+05:30

ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ పార్టీపై అభిమానం ఉంటే ఉద్యోగాలకు రాజీ నామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ విమర్శించారు

ధన్వాడ రాస్తారోకోలో మాట్లాడుతున్న నామాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ధన్వాడ ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి

- రాస్తారోకోలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ


ధన్వాడ/ మరికల్‌/ దామరగిద్ద/ మద్దూర్‌/ మక్తల్‌, డిసెంబరు 29 : ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ పార్టీపై అభిమానం ఉంటే ఉద్యోగాలకు రాజీ నామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ విమర్శించారు. ధన్వాడలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ మంగళవారం స్థానికంగా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నామాజీ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీ సులు ఇష్టానుసారంగా లాఠీచార్జీ చేశారన్నారు. ఎస్‌ఐ రాజేందర్‌, మం డల వ్యవసాయాధికారి ప్రదీప్‌కుమార్‌లు ప్రభుత్వ ఉద్యోగుల కాకుండా టీఆర్‌ఎస్‌ నాయకుల్లా పనిచేస్తున్నారని నామాజీ విమర్శించారు. అనంతరం సీఐ శివకు మార్‌ సారథ్యంలో బీజేపీ నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విమలాఅంజియాదవ్‌, రామచంద్రయ్య, మల్ల య్య, ఎంపీటీసీలు ఉమేష్‌కుమార్‌, గోవర్ధన్‌గౌడ్‌, మాదవి, శ్రీనివాసులుగౌడ్‌, అంజియాదవ్‌ పాల్గొన్నారు. ధన్వాడ ఎస్‌ఐ రాజేంధర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం మరికల్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో అంతర్‌రాష్ట్ర రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సీఐ శివకుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమం లో పేట సింగల్‌విండో అధ్యక్షుడు సత్యయాదవ్‌, పార్లమెంట్‌ కన్వీనర్‌ నర్సన్‌గౌడు, బీజెవైయం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి,పట్టణ అధ్యక్షుడు వేణు, అప్పంపల్లి సర్పంచ్‌ తిరుపతిరెడ్డి, వెంకటేష్‌, రాజేష్‌, జానకి వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దామరగిద్దమద్దూర్‌, మక్తల్‌లలో కూడా బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మద్దూర్‌లో జిల్లా నాయకుడు మదన్‌ ఆధ్వ ర్యంలో రాస్తారోకో చేపట్టారు. దామరగిద్దలో బీజేపీ జిల్లా నాయకులు సంజీవ్‌ గౌడ్‌, మండల అధ్యక్షుడు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, ఆంజనేయులు గౌడ్‌, విజయ్‌, ఎంపీటీసీ కందెన్‌పల్లి అంజి పాల్గొన్నారు. మక్తల్‌ పట్టణంలోని అంబే డ్కర్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయ కులు కర్నిస్వామి, రాజశేఖర్‌రెడ్డి, దేవరింటి నర్సింహారెడ్డి, బలరాంరెడ్డి, మంజు నాత్‌, సూర్య ఆంజనేయులు, బుగ్గన్న, కొండయ్య, రహీంపటేల్‌, బాలరాజు, ఆంజనేయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T04:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising