ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రథోత్సవంలో పాల్గొనడం అదృష్టం

ABN, First Publish Date - 2020-10-25T06:01:04+05:30

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ దేవి రథోత్సవంలో పాల్గొనడం అదృష్టమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి


అలంపూర్‌, అక్టోబరు 24 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగుళాంబ దేవి రథోత్సవంలో పాల్గొనడం అదృష్టమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర్వులకు మంత్రి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ సరితతిరుతపయ్య, ఎమ్మెల్యే వీఎం అబ్రహాంలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్ర్తాలను సమర్పించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.


జోగుళాంబ ఆలయంలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రథాన్ని లాగారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరు 20 నుంచి జరిగే తుంగభద్ర పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.


భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారని, త్వరలో వారికి న్యాయం చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ వెంకటేష్‌, రాష్ట్ర వినియోగదారుల కమిటీ చైర్మన్‌ గట్టు తిమ్మప్ప, నాయకులు నారాయణరెడ్డి, పటేల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు సుదర్శన్‌గౌడ్‌, సుష్మారావు, కోఆప్షన్‌మెంబరు అల్లబకాష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాలకు జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2020-10-25T06:01:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising