ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కోసం గ్రామస్థుల బైఠాయింపు

ABN, First Publish Date - 2020-12-16T03:46:37+05:30

నీటి సరఫరా సక్రమంగా కావడం లేదని అమ్రాబాద్‌ మండలం దోమలపెంటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రా మస్థులు మంగళవారం శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బైఠాయిం చారు.

దోమలపెంటలో ఇరిగేషన్‌ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  దోమలపెంటలో శ్రీశైలం-హైదరాబాద్‌ రహదారిపై రాస్తారోకో

-  రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

దోమలపెంట, డిసెంబరు 15: నీటి సరఫరా సక్రమంగా కావడం లేదని అమ్రాబాద్‌ మండలం దోమలపెంటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రా మస్థులు మంగళవారం శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బైఠాయిం చారు. దీంతో శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఇరువైపులా రెండు కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.  అనంతరం తాగునీటి సరఫరాలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్థులు ఆ శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామానికి పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ తాగునీ టి సమస్య తీరడంలేదని, వారానికి ఒక్కసారి సరఫరా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా చేసేందుకు అటు ఇరిగేషన్‌ శాఖ, ఇటు గ్రామ పంచాయతీ తరుపున ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ ప్రజలను ఇబ్బందు లకు గురిచేస్తున్నారని వారు వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించేం దుకు అధికారులు, నాయకులు స్పందించడం లేదని వారు ఆరోపించారు. ఇరిగేషన్‌ శాఖ జేఈ ధరణికుమార్‌, జెన్‌కో సీఈ ప్రభాకర్‌రావుతో మాట్లాడి అదనంగా మరిన్ని మోటారు పంపులను ఏర్పాటు చేసి నిత్యం నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరి స్తామని ఆయన హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.



Updated Date - 2020-12-16T03:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising