ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్
ABN, First Publish Date - 2020-11-03T10:21:37+05:30
ప్రజావాణికి వచ్చిన పిటిషన్లను పెండింగ్‌లో పెట్ట కుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.వెం కట్రావు ఆదేశించారు
కలెక్టరేట్(మహబూబ్‌నగర్), నవంబరు 2: ప్రజావాణికి వచ్చిన పిటిషన్లను పెండింగ్‌లో పెట్ట కుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.వెం కట్రావు ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 12 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూములు, పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. కార్యకమ్రంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఏడీ శ్యాంసుందర్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-11-03T10:21:37+05:30 IST