వచ్చే నెలలోనే కొవిడ్ వ్యాక్సిన్!
ABN, First Publish Date - 2020-12-12T04:18:09+05:30
జనవరి మొదటి వారం వరకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ చందూనాయక్ తెలిపారు.
- తొలి విడతలో 2,320 మంది వైద్య సిబ్బందికి టీకా
- వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి చందూనాయక్
గద్వాలక్రైం, డిసెంబరు 11 : జనవరి మొదటి వారం వరకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ చందూనాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి మొదటివారంలో కొవిడ్ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మొదటి విడతగా వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం 2,060 మందికి, ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన 260మంది సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వను న్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి వివరాలను సేకరించి హైదరాబాద్‌కు పంపించినట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ను అందించే విధానంపై జిల్లాకు చెందిన 175 మందికి ఈ నెల 20 నుంచి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 10 కేంద్రాలను ఏర్పాటు చేసి వాక్సిన్‌ను నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:18:09+05:30 IST