ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దిశ’కు ఏడాది

ABN, First Publish Date - 2020-11-27T03:12:42+05:30

దిశ ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఘటన 

- ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితుల హతం


నారాయణపేట క్రైం, నవంబరు 27 : దిశ ఘటన ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. దేశ వ్యాప్తంగా సంచనలం రేకెత్తించిన ఈ ఘటన 2019, నవంబరు 27న హైదరాబాద్‌ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్‌ వద్ద చోటు చేసుకున్నది. ఈ ఘటన జరిగి శుక్రవారానికి సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. ఈ ఘటన తరువాత తెలుగు రాష్ర్టాలతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వె ల్లువెత్తాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ గ్రామానికి చెందిన ఓ యువకు డితో పాటు ఇదే మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన మరో ముగ్గురు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు పది రోజుల అ నంతరం 2019, డిసెంబరు 6వ తేదీ తెల్లవారుజామున షాద్‌నగర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌం టర్‌లో నిందితులు మృతి చెందారు. ఆ తర్వాత నిందితుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే, ఈ సంఘటన తర్వాత పోలీస్‌ శాఖలో కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. జీరో ఎఫ్‌ఐఆర్‌ అనే విధానం అమలులో ఉన్నా, ఈ విధానాన్ని పటిష్టం చేయాలని అప్పట్లో పోలీస్‌ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే డయల్‌ 100కు వచ్చే కాల్స్‌ పట్ల నిర్లక్ష్యం చే యకుండా, తక్షణమే స్పందించాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు వెలవడ్డాయి. మ హిళలు, విద్యార్థినులు, యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధం గా ఏపీ ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని రూపొందించి, అమల్లోకి తీసుకొచ్చింది.

Updated Date - 2020-11-27T03:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising