ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి

ABN, First Publish Date - 2020-10-01T10:24:02+05:30

పురపాలిక అభివృద్ధి విషయంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మునిసిపల్‌ చైర్మన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 30: పురపాలిక అభివృద్ధి విషయంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మునిసిపల్‌ చైర్మన్‌ కొరమోని నర్సింహులు కోరారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభివృద్ధి విషయంలో నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పురపాలిక సర్వతోముఖాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. బుధవారం చైర్మన్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వయంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి, సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టారన్నారు.


బీజేపీ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డులలో నిధుల కేటాయింపు లేకపోవడంపై సభ్యులు అంజయ్య, చెన్నవీరయ్య పెదవి విరిచారు. కౌన్సిల్‌ సమావేశానికి మందు రోజు రాత్రి ఎజెండా ఇవ్వడం సరికాదని బీజేపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం వారం రోజుల ముందు ఎజెండా ఇవ్వాలని కోరారు. విలీన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వాలని, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సభ్యులు కోరారు. పలువురు కౌన్సిలర్లు ఇలా వచ్చి సంతకాలు చేసి, అలా వెళ్లిపోయారు. సమావేశంలో కమిషనర్‌ సురేందర్‌, ఆయా శాఖల అధికారులు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T10:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising