ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాలను కూల్చి వేయండి

ABN, First Publish Date - 2020-07-05T11:27:29+05:30

అధికారులు నాలా ఆక్రమణలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కూల్చి వేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇటీవ ల కురిసిన భారీ వర్షానికి పెద్ద చెరువు అలుగు ద్వారా రామయ్యబౌళిలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జూలై 4: అధికారులు నాలా ఆక్రమణలపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కూల్చి వేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇటీవ ల కురిసిన భారీ వర్షానికి పెద్ద చెరువు అలుగు ద్వారా రామయ్యబౌళిలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో శనివారం అధికారులతో కలి సి మంత్రి అలుగును పరిశీలించారు. కుచించుకు పోయిన నాలాను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎవరికి వారు నాలాపై బాత్రూ మ్‌లు, ప్రహరీలు కట్టడంతో నాలా చిన్నదై నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆదే శించారు. పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇక్కడ మినీ శిల్పారామం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, కమిషనర్‌ సురేందర్‌, కౌన్సిలర్‌ రాశెద్‌ఖాన్‌ పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ, బీజేపీ నాయకులు

టీఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం బీజేపీ నాయకులు భానుచందర్‌, అమ ర్నాథ్‌రెడ్డి, టీడీపీ నాయకులు సత్యం ముదిరాజ్‌, రాజు తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కండువాలు కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. 

Updated Date - 2020-07-05T11:27:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising