ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మేస్తున్న కరోనా.. ఒకే రోజు 45 కేసులు, ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-07-13T20:46:27+05:30

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం ఒక్క రోజు 45 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్డులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌/ మహబూబ్‌ నగర్‌ (వైద్య విభాగం): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం ఒక్క రోజు 45 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్డులో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. క్రిస్టియన్‌పల్లి సమీపంలోని శ్రీరామ కాలనీకి చెందిన వ్యక్తి భూత్పూరులోని ఓ బ్యాంకులో పని చేస్తున్నాడు. అతడికి హైదరాబాద్‌లో పరీక్ష చేయించగా పాజిటివ్‌గా తేలింది. హన్వాడ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో ఉం డగా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని తేలింది. పట్టణంలోని షాషాబ్‌గుట్ట ప్రాంతానికి చెంది న ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో హైదరాబా ద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా శనివారం అక్కడే మర ణించారు. పట్టణంలోని అస్లాంఖాన్‌ వీధికి చెందిన వ్యక్తికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. పాతపాలమూరులోని ధోభీవాడకు చెందిన మరో వ్యక్తికి కూడా కరోనా అని తేలింది. బాలానగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడం తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని ఉస్మానియాలో చేర్పించారు. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆదివారం ఒక్క రోజే 14 కేసులు నమోదయ్యా యి. అచ్చంపేట పట్టణంలో అత్యధికంగా తొమ్మిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. బీకే ఉప్పునుంతలలో ఒకరికి, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఇద్దరికి పాజిటివ్‌ రాగా, వారిలో ఒక పోలీసు అధికారి ఉన్నారు. టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ వెనక గల కాలనీలో మరొకరికి, కొల్లాపూర్‌, తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు నిర్దా రించారు. ఆయా కేసులకు సంబంధించి 74 మందిని వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌ చేశారు. 39 శాంపిల్స్‌కు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. 


వనపర్తి జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని పీర్లగుట్ట లో ఒకటి, బ్రహ్మంగారి వీధిలో నాలుగు, టీచర్స్‌ కాలనీలో ఒకటి, బండారు నగర్‌లో ఒకటి, కేడీఆర్‌లో మరో కేసు నమోదయ్యాయి. కొత్తకోట ఆరు కేసులు నమోదయ్యాయి. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఏడు కరోనా కేసులు నమోద య్యాయి. అందులో గద్వాల పట్టణంలోనే ఆరు కేసులు నమోదు కాగా, అలంపూర్‌లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

నారాయణపేట జిల్లాలో ఆదివారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల్‌ లైన్‌లో నివసిస్తున్న ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కరోనా సోకింది. నారాయణపేట మండలంలోని జాజాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోమన్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని దూల్‌పేట్‌కు చెందిన 68 ఏళ్ల వయస్సు గల వ్యక్తికి ఈ నెల 10న పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఆదివారం అతడు మృతి చెందాడు. 

Updated Date - 2020-07-13T20:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising