ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్యాలను వంద శాతం సాధించాలి

ABN, First Publish Date - 2020-12-04T03:22:59+05:30

బ్యాంకుల అనుసంధానంతో స్వయం సహాయక బృంధాలకు అమలు చేస్తున్న బ్యాంక్‌ లింకేజీ, సామాజిక పెట్టుబడి రుణాల లక్ష్యాలను ఈ నెల చివరి నాటికి 100 శాతం సాధించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అన్నారు.

రుణాలపై సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 3: బ్యాంకుల అనుసంధానంతో స్వయం సహాయక బృంధాలకు అమలు చేస్తున్న బ్యాంక్‌ లింకేజీ, సామాజిక పెట్టుబడి రుణాల లక్ష్యాలను ఈ నెల చివరి నాటికి 100 శాతం సాధించాలని  కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు  అన్నారు. కలెక్టరేట్‌ నుంచి బ్యాంకర్లతో గురువారం ఆ యన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డు తూ  జిల్లాలో బ్యాంక్‌ లింకేజీ కింద స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రు ణాల్లో ఇప్పటివరకు 61 శాతం మాత్రమే పురోగతి ఉందన్నారు. ఈ విషయాన్ని  దృష్టిలో ఉంచుకొని ఈ నెలాఖరుకు వంద శాతం ఇచ్చేలా చర్యలు తీసుకోవా లని బ్యాంకర్లను కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు గాను వెంటనే ఆయా బ్యాంకు నియంత్రణ అధికారులు బ్రాంచ్‌ మేనేజర్లతో సమావేశాలు నిర్వహించాల న్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో కూడా స్వయం సహాయక బృం దాలకిచ్చే రుణాలు 100శాతం ఇవ్వాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ గుర్తు చేశా రు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, డీఆర్వో కే.స్వ ర్ణలత, ఎల్‌డీఎం నాగరాజు, డీఆర్‌డీవో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

 రక్తదాన శిబిరాలను నిర్వహించాలి 

 అత్యవసరమైన వారికి  రక్తాన్ని అందించే ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఆయా మండలాల్లో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాలను నిర్వహించాలని  కలెక్టర్‌ గురువారం ఓ ప్రకటనలో  తెలి పారు. జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్థులు ఉన్నారని, వారికి నెలనెలా రక్తం అవసరమవుతుందన్నారు. రక్తదాతలు ముందుకు రావాలన్నారు.  

Updated Date - 2020-12-04T03:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising