అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు
ABN, First Publish Date - 2020-12-02T03:03:52+05:30
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పిస్తామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ అన్నారు.
కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇప్పిస్తామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో మం గళవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందిం చాలని అక్రిడిటేషన్ కమిటీ అధికారి అంజిలప్పను ఆదేశించారు. సీనియర్ పాత్రికేయులు మహ్మద్ అబ్దుల్లాఖాన్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌లో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వపరంగా అందించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి జర్నలిస్టులకు కేటాయిస్తామన్నారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, అక్రిడిటేషన్ కార్డుల జారీ అధికారి డాక్టర్ అంజిలప్ప, సీనియర్ పా త్రికేయులు అబ్దుల్లా, పరిపూర్ణం, సురేష్, వెంకటస్వామి, దినకర్, విజయ్, శ్రీని వాస్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
రూర్బన్ పనులను వేగవంతం చేయాలి
రూర్బన్ పథకం కింద జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలాన్ని ఎంపిక చేసి నందున పనులు వేగవంతంగా జరగాలని కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో 14శాఖల జిల్లాస్థాయి అధికారులతో రూ ర్బన్ పనులపై సమీక్షించారు. 420 అభివృద్ది పనులను డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి రూర్బన్ కింద మండలానికి విడుదలైన రూ.30కోట్ల రూపాయల నిధులను సద్వినియోగం చేసి పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల క్లస్టర్‌ను అభి వృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మనూచౌదరి, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సుధాకర్, డీఈవో గోవిందరాజులు, అటవీశాఖ అధికారి కిష్టగౌడ్, డీఎస్‌వో మో హన్‌బాబు, ఈఈపీఆర్ దామోదర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా శ్యాంప్రసాద్‌రావు
కందనూలు: నాగర్‌కర్నూల్‌కి చెందిన న్యాయవాది శ్యాంప్రసాద్‌రావును నాగర్ కర్నూల్ సీనియర్, జూనియర్ సివిల్ కోర్టుల్లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కలెక్టర్ ఎల్‌పీ.శర్మన్ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను మంగళవారం కలెక్టరేట్‌లో న్యాయవాది శ్యాంప్రసాద్‌రావుకు అందించారు.
Updated Date - 2020-12-02T03:03:52+05:30 IST