ప్రశాంతంగా బీసీ గురుకుల.. ప్రవేశ పరీక్షలు
ABN, First Publish Date - 2020-03-16T08:15:10+05:30
జిల్లాలో ఆదివారం నిర్వహించిన బీసీ గురుకుల ప్రవేశపరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు.
7191మంది విద్యార్థులకు గానూ 6272మంది హాజరు
916మంది గైర్హాజరు డీఈవో గోవిందరాజులు
కందనూలు, మార్చి 15 : జిల్లాలో ఆదివారం నిర్వహించిన బీసీ గురుకుల ప్రవేశపరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. మహాత్మాజ్యోతి బాఫూలే బీసీ గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు నిర్వహించిన పరీక్షలకు గానూ 7191మంది విద్యార్థులకు గానూ 6272మంది విద్యార్థులు హాజరుకాగా 916మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ప్లవర్ హై స్కూల్, జడ్పీహెచ్‌ఎస్, బాలుర, బాలికల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగర్‌కర్నూల్ పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా డీఆర్వో మధుసూదన్‌నాయక్, డీఈవో గోవిందరాజులు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి మంతటి నారాయణ, పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, కల్వకుర్తి బీసీ గురుకుల ప్రిన్సిపాల్ ఎల్లయ్య పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T08:15:10+05:30 IST