ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం

ABN, First Publish Date - 2020-02-28T11:18:54+05:30

బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యానేరమని జిల్లా సంక్షేమాధికారి కమలాదేవి అన్నారు. చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా సంక్షేమాధికారి కమలాదేవి

గద్వాల పట్టణంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహణ


గద్వాలక్రైం, ఫిబ్రవరి 27 : బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యానేరమని జిల్లా సంక్షేమాధికారి కమలాదేవి అన్నారు. చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిట్‌మెంట్స్‌ సంస,్ధ చైల్డ్‌లైన్‌-1098 ఆధ్వర్యం లో గద్వాలలోని మోమిన్‌మెహల్లా కాలనీలో గురువారం ఓపెన్‌ హాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా సంక్షేమాధికారి కమలాదేవి మాట్లాడుతూ 0-18 లోపు పిల్లలకు ఏమైనా సమస్యలుంటే వెంటనే 1098 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే బడి బయట పిల్లలు, బాలకార్మికులు, భిక్షాటన చేస్తున్న అనాఽథలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు.


చదువుకుంటున్న దివ్యాంగులు మూడు చక్రాల వాహనం కోసం ధరఖాస్తు చేసుకోవచ్చాన్నారు. సీడీపీఓ సంధ్యారాణి మాట్లాడుతూ పిల్లలను బడికి పంపించాలే కాని పనికి పంపించరాదన్నారు. బాల్యవివాహాలు చేస్తే శిక్షలు తప్పవన్నారు. బాలరక్షభవన్‌ కో-ఆర్డినేటర్‌ హేమలత మాట్లాడుతూ పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే 1098కు సమాచారం అందివ్వాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కమాలాదేవితోపాటు సిడిపిఓ సంధ్యారాణి, బాలరక్షాభవన్‌ కో-ఆర్డినేటర్‌ హేమలత, డీసీపీఓ కుసుమలత, చైల్డ్‌లైన్‌-1098 కౌన్సిలర్‌ నర్సింహ్మా పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:18:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising