యువతను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం
ABN, First Publish Date - 2020-12-02T03:16:45+05:30
ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ఆరోపించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్
ఆత్మకూర్, డిసెంబరు 1: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ఆరోపించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహాంలో మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఎం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజ రై మాట్టాడారు. ఇప్పటి వరకు ఏటా రెండు వేల ఉద్యోగాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. అధికారం చేపట్టిన వెంటనే దేశమంతా హిందూ మత విధ్వేషాలు రెచ్చగొట్టి మతకల్లోలాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వ్యవసాయ బిల్లులు రద్దు చేసి యువకులకు ఉద్యోగ ఉ పాధి అవకాశాలు కల్పించకుంటే ఆందోళనలకు పూనుకుంటామన్నారు. అనంతరం యువకుల సమస్యలపై పోరాడుతున్న డీవైఎఫ్‌ఐ సంఘానికి ఆకర్షితులైన పలువురు యువకులను డి వై ఎఫ్‌ఐ సంఘంలోకి ఆహ్వానించారు. నాయకులు మహిమూద్, శ్రీహరి, గోపి, రాజు, వెంకటేష్, రమేష్, అజయ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T03:16:45+05:30 IST