ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలి

ABN, First Publish Date - 2020-12-16T03:14:25+05:30

ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగులకు అ న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దిం పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి అన్నారు.

తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి 

వనపర్తి రూరల్‌, డిసెంబరు 15: ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగులకు అ న్యాయం చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దిం పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి అన్నారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ యువతను అడుగడుగునా మోసంచేశారని ఆరోపించారు. తహసీల్దార్‌ రాజేంద్రగౌడ్‌కు వినతిపత్రాన్ని అందించారు. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తిరుమలేష్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీ.కృష్ణ, బీ.వెంకటేశ్వర్లు, శ్రీశైలం కుమారస్వామి, సీతారా    ములు, నారా యణ, రామన్‌గౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు  పాల్గొన్నారు.

 నిరుద్యోగ భృతిని చెల్లించాలి

పాన్‌గల్‌: సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు తక్షణమే నిరుద్యోగ భృతిని చెల్లిం చాలని బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రమేష్‌ అన్నారు. ఈ మేరకు మం గళవారం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. నాయకులు శ్రీకాంత్‌, రమేష్‌, రాకేష్‌, వెంకటేష్‌, లక్ష్మణ్‌, సూర్యకుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

 ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్‌ను ఆదుకోవాలి 

కొత్తకోట: కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లకు వేతనమిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు నరసింహా అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తహసీ ల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ రమేష్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. మహేష్‌యాదవ్‌, అశోక్‌, గౌతమ్‌రెడ్డి, కురుమూర్తి, శ్యాం, నవీన్‌, విష్ణు, మొగిలి, నర్సింహ, సురేష్‌, చందు, రఘురెడ్డి పాల్గొన్నారు. 

నిరుద్యోగులను  ముంచిన రాష్ట్ర ప్రభుత్వం

ఆత్మకూర్‌/అమరచింత: రాష్ట్రసాధనకు నిరుద్యోగులు ప్రాణాలను లెక్క చే యకుండా ఉద్యమిస్తే నేడు రాష్ట్ర ప్రభుత్వం వారిని నిలువునా ముంచేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ ఆరోపించారు. ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లో బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. ఆత్మకూర్‌ తహసీల్దార్‌ మోహన్‌కు వినతిపత్రం అందించారు.  రాజేష్‌, అశ్వినికుమార్‌, విజయ్‌, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

రేవలి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చే యాలని బీజేవైఎం జిల్లా కార్యదర్శి పరశురాముడు డిమాండ్‌ చేశారు. తహసీ ల్దార్‌కు మంగళవారం అందించారు. శ్రీశైలం, జమ్ములు, ఎద్దుల రమేష్‌, ఈర్ల వెంకటేష్‌, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-16T03:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising