వరికి మద్దతు ధర పెంచాలి
ABN, First Publish Date - 2020-12-12T04:26:49+05:30
రైతులు పండించిన సన్నరకం వరికి ప్రభుత్వం మద్దతు ధరను పెంచా లని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాల ని కోరుతూ శుక్రవారం బీజేపీ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చారు.
- బీజేపీ నాయకుల ధర్నా
భూత్పూర్, డిసెంబరు 11 : రైతులు పండించిన సన్నరకం వరికి ప్రభుత్వం మద్దతు ధరను పెంచా లని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాల ని కోరుతూ శుక్రవారం బీజేపీ పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి మాట్లాడారు. రైతులు పం డించిన సన్నరకం వరికి మద్దతు ధర రూ.2500 చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా లక్ష రూపాయల వరకు రైతు రుణమాపీ చేయాలన్నా రు. ప్రతియేటా రెండు సార్లు చెల్లించే రైతుబంధు పథకం తేదీలను రైతులకు తెలిసే విధంగా ముందే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ వ్యవసాయ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. అంత కుముందు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజే పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా తహసీల్దార్‌కు వివిధ డిమాండ్లతో కూడిన విన తిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో పార్టీ మం డల, పట్టణ అధ్యక్షులు బాల్‌రెడ్డి, రవీందర్, గాల్ రెడ్డి, నరేష్‌చారి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రైతుల రుణమాఫీ చేయాలి
దేవరకద్ర : రైతులకు వెంటనే రుణమాఫీ చే యాలని బీజేపీ మండల అధ్యక్షుడు కొండ అంజన్ కుమార్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేశారు. ఉప తహసీ ల్దార్ శివరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయిరాజ్, నారా యణరెడ్డి, శేఖర్, ఊషన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు వినతి
అడ్డాకుల : సన్నవడ్లకు మద్దతు ధర చెల్లించా లని కోరుతూ బీజేపీ కిసాన్‌మోర్చా మండల కమి టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రాంబాయికి వినతిప త్రం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నాయకుడు వెంకట్‌సాగర్, గట్టు మల్లేశ్, అరవింద్‌రెడ్డి, కావలి రాజు, సురేందర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తిరుపతి నాయక్, రమేశ్ సాగర్, దాస్, ప్రేమ్‌కు మార్, తుకారాంనాయక్, నరేందర్, శ్రీకాంత్, రవి, రాజమౌళి పాల్గొన్నారు.
మూసాపేటలో..
మూసాపేట : సన్నరకం వడ్లకు మద్దతు ధర చెల్లించాలని కోరుతూ బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ మంజులకు వినతి పత్రా న్ని అందజేసారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనువాసరెడ్డి, యాదగిరి, ప్రవీణ్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T04:26:49+05:30 IST