ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిత్రుడి కోసమే కేసీఆర్‌ మౌనం..!

ABN, First Publish Date - 2020-05-18T10:47:30+05:30

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అడ్డుకోవడంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జిల్లాధ్యక్షుడు రామచంద్రా రెడ్డి


గద్వాల టౌన్‌/మల్దకల్‌, మే 17 : పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ను తరలించేందుకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అడ్డుకోవడంలో కేసీఆర్‌ నిర్లక్ష్యం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రియమిత్రుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్‌ కోసమే దక్షిణ తెలంగాణ రైతుల నోట్లో దుమ్ము పడుతున్నా కేసీఆర్‌ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని డీకే బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. 1845అడుగుల మేరకు శ్రీశైలంలో నీరు ఉన్నప్పుడే నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించాల్సి ఉండగా గత ఉమ్మడి ప్రభుత్వాలు దాన్ని 1800అడుగులకు కుదించడం వెనక కుట్ర దాగిఉందన్నారు. 


 నీటి చౌర్యాన్ని అడ్డుకుని 203జీవోను ఉపసంహరించే వరకు పోరాడుతామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర జనవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. అపెక్స్‌ కమిటీ నిర్ణయం వచ్చే వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు రామచంద్రా రెడ్డి వివరించారు. సమావేశంలో అప్సర్‌ పాషా, రాజశేఖర్‌ రెడ్డి, రవికుమార్‌, రామాంజనేయులు, బండల వెంకటరాములు, శ్రీనివాస్‌లు, జనార్దన్‌ తదితరులున్నారు. 


 చేతివృత్తులకు ప్రభుత్వం చేయూతనివ్వాలి

 చేతివృత్తుల వారి కుటుంబాలకు ప్రభుత్వం చేయూత అందించాలని గద్వాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం మల్దకల్‌ మండల పరిదిలోని చర్లగార్లపాడులోని కుమ్మరి కులవృత్తుల వారి కుటుంబాలను ఆయన సందర్శించారు.  నాయకులు రాజశేఖర్‌రెడ్డి, దామవెంకటేశ్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, బాలు, తిరుపతి, కిశోర్‌ తదితరులు పాల్గోన్నారు.

Updated Date - 2020-05-18T10:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising