ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ ప్రారంభం

ABN, First Publish Date - 2020-10-01T10:26:52+05:30

గ్రామాల్లో ప్రతి ఇంటి నిర్మా ణానికి సంబంధించిన లెక్క పక్కాగా ఉండబోతుందని అదనపు కలెక్టర్‌ మనూ చౌదరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌యాప్‌ పనితీరును పరిశీలించిన అదనపు కలెక్టర్‌ మనుచౌదరి 


నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి ఇంటి నిర్మా ణానికి సంబంధించిన లెక్క పక్కాగా ఉండబోతుందని అదనపు కలెక్టర్‌ మనూ చౌదరి అన్నారు. బుధవారం నల్లవెల్లి గ్రామ పరిధిలోని ఆన్‌లైన్‌యాప్‌ పనితీరు ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 461గ్రామపంచాయతీల సిబ్బంది ఇంటింటికి సర్వే ప్రారంభించారన్నారు. ఇళ్ల యజమానులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను, ఆధార్‌ నెంబర్లను సేకరి స్తున్నారని, అనుమతి లేని ఇళ్లకు అసెన్‌మెంట్‌ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యం లో పలు గ్రామాల్లో చేపట్టిన ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియకు సంబంధించిన వివరా లను ఎంపీడీఓలతో అదనపు కలెక్టర్‌ మాట్లాడారు.


నిర్ణీత గడువులోపు రైతు వేదికలను అందజేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలోని నాలుగు ము నిసిపాలిటీల్లో వార్డుల వారిగా ఆస్తి ఆన్‌లైన్‌ వివరాల పనులను వేగవంతంగా కొనసాగించాలని ఏ ఒక్క ఇల్లు మిస్‌ కాకుండా ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ప్రతి పట్టణంలోని అన్ని కట్టడాలను నమోదు చేయాలని, ఆన్‌లైన్‌ యాప్‌ వివరాలపై మునిసిపల్‌ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. నూతనంగా నిర్మించే ప్రతి ఇంటిని ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఆన్‌లైన్‌ పొందుపరిచిన తర్వాత ఫోన్‌ యాప్‌లో ఆస్తి యజమాని ఫోటో ఆధార్‌ ఫోన్‌ నెంబరు కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 


మహిళలకు, పిల్లలకు పోషక లోపాలు లేకుండా చూడాలి

అధికారులు సమన్వయంతో పని చేసి పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం ద్వా రా తల్లి, పిల్లలలో పోషకాహార లోపాలు గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ మనూచౌదరి కోరారు. బుధవా రం కలెక్టర్‌ ప్రజా వాణి మీటింగ్‌ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ పోషణ్‌ అభియాన్‌ 2018-19 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారాల కార్యక్రమం సమన్వయ కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్‌  అధ్యక్షత వహించి మాట్లాడారు. ముందుగా 2018-19 సంవత్సరంలో పోషక అభియాన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని అభినందించారు.


  అనంతరం పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించి పురస్కారాలు పొందిన సీడీపీవో శాఖ నుంచి కొల్లాపూర్‌ అధికారి వెంకటరమణ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి పెంట్లవెల్లి ఆరోగ్య కేంద్రం డాక్టర్‌  చంద్రశేఖర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి కొల్లాపూర్‌ డి. గంగామో హన్‌లకు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారం పొందినందుకు ప్రశంసా పత్రా లను అందజేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కారాలు పొందిన 25 మందికి కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు. శిక్షణ సహాయ కల్టెర్‌ చిత్రా మిశ్రా, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రజ్వల, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సురేష్‌ మోహన్‌, జిల్లా విద్యా అధికారి గోవింద్‌ రాజులు, పోషక అభియాణ్‌ సమన్వయకర్త విజ్ఞాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T10:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising