ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలతో మర్యాదగా మెలగాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2020-12-31T03:54:25+05:30

పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫి ర్యాదుదారులతో పాటు సమాజంలోని ప్రజలతో పోలీస్‌ సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ చేతన అన్నారు.

పేట డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ చేతన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట క్రైం, డిసెంబరు 30 : పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫి ర్యాదుదారులతో పాటు సమాజంలోని ప్రజలతో పోలీస్‌ సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ చేతన అన్నారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నివారణకు గస్తీని మరింత పటిష్టం చేయాలన్నారు. కమ్యూనిటీ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలుపర్చాలని తెలిపారు. పలు సూచనలు, సలహాలు అందించా రు. డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.



మక్తల్‌ సర్కిల్‌ ఆఫీస్‌ తనిఖీ


మక్తల్‌రూరల్‌ : మక్తల్‌ పట్టణంలోని సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కార్యాల యాన్ని ఎస్పీ చేతన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సర్కిల్‌ ఆఫీస్‌లో గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌ సీడీ ఫైల్స్‌ను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసులు త్వరగా పూర్తిచేయాలని సీఐ శంకర్‌కు సూచించారు. సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లోని సీఐ, ఎస్సై, సిబ్బం దితో మాట్లాడుతూ 100డయల్‌కు ఫోన్‌కాల్‌ రాగానే వెంటనే సంఘ టన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని సూచించారు.  కార్యక్రమంలో సీఐ శంకర్‌, మక్తల్‌ ఎస్సై ఏ.రాములు, ఊట్కూర్‌ ఎస్సైరవి, మాగనూరు శివనాగేశ్వర్‌, క్రిష్ణ ఎస్సై మురళి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T03:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising