ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి తెరుచుకోనున్న బార్లు

ABN, First Publish Date - 2020-09-26T10:47:51+05:30

బార్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 25: బార్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. శనివారం నుంచే బార్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడునెలలుగా మూతపడిన బార్లను శనివారం నుంచి కోవిద్‌ నిబంధనలు పాటిస్తూ తెరువాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అయితే మద్యం దుకాణాల పర్మిట్‌ గదులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38 బార్లు ఉన్నాయి. ఒక్కో బార్‌లో 40 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. దీంతో 150 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.  బార్లను శుభ్రం చేసుకోవడంతోనే శనివారం గడవనుంది. ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బార్లు వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా బార్ల వద్ద వచ్చే మందుబాబులకు తప్పనిసరిగా థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రతిరోజు ఉదయం, సా యంత్రం శానిటైజ్‌ చేయాల్సి ఉంటుంది. బార్లు తెరువడంపై సీఎం కేసీఆర్‌, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-09-26T10:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising