ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ వర్కర్ల కనీస వేతనం రూ.10 వేలు చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-18T03:17:18+05:30

ఆశ వర్కర్లకు కనీస ఫిక్స్‌డ్‌ వేతనాలు నెలకు 10వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనే యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆశ వర్కర్లు, సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముందు ఆశ వర్కర్ల  ధర్నా

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, డిసెంబరు17: ఆశ వర్కర్లకు కనీస ఫిక్స్‌డ్‌ వేతనాలు నెలకు 10వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనే యులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌ ముందు సీఐటీయూ, తెలంగాణ వలంటీర్‌ హెల్త్‌ కమ్యూనిటీ వర్కర్స్‌ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో మధుసూదన్‌నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ఆశ వర్క ర్లకు కనీస వేతనాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 106రోజుల సుధీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న రూ.7500 వేతనాన్ని నేటికి చాలా ప్రాంతాల్లో సక్రమంగా చెల్లించడం లేదన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆశ వర్కర్లకు కనీస వేతనం 10వేల రూపాయలు కల్లించడంతో పాటు ఉద్యోగ భధ్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు చెన్నమ్మ, ఉపాధ్యక్షురాలు స్వప్న, సభ్యులు శ్రీదే వి, శివశీల, వరలక్ష్మి, నాగేశ్వరి, శకుంతల, లక్ష్మి, కృష్ణవేణి, సావిత్రి, పద్మ, లలిత, వెంకటమ్మ, రజిత, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2020-12-18T03:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising