ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ABN, First Publish Date - 2020-10-19T09:05:34+05:30

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌజ్‌ ప్రమాదం తో మహబూబ్‌నగర్‌కు వచ్చే తాగునీటికి ఆటంకం కలగనున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూ చనల మేరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్ర త్యామ్నాయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబంధిత అధికారులతో

కలెక్టర్‌ వెంకట్రావు సమీక్ష


 కలెక్టరేట్‌, అక్టోబరు 18: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌజ్‌ ప్రమాదం తో మహబూబ్‌నగర్‌కు వచ్చే తాగునీటికి ఆటంకం కలగనున్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూ చనల మేరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని  కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. ఆదివారం మిషన్‌భగీ రథ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, ఇరిగేషన్‌ అధి కా రులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ మునిసిపా లిటీలతో పాటు దాదాపు అన్ని గ్రామాలకు కల్వ కుర్తి పథకం నుంచే మిషన్‌ భగీరథ నీరు వస్తోం దని, ప్రస్తుతం నీటి సరఫరాకు ఇబ్బందులు రావ డంతో  ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని సూ చించారు.


కోయిలసాగర్‌, భీమా పథకాల ద్వారా తాగునీరందించేందుకు ఏర్పాట్లు చే యాలని ఆదే శించారు. అదేవిధంగ గ్రామాల్లో పవ ర్‌బోర్లను వి నియోగించాలన్నారు. జిల్లాలో కోయి లసాగర్‌ ద్వా రా వీలైనంత మేర తాగునీటిని అం దించాలన్నా రు. ప్రత్యామ్నాయ ప్రణాళిక కోసం గ్రామాలవారీ గా, మండలాలవారీగా కార్యాచరణ అమలు చేయా లని సూచించారు. ప్రత్యామ్నాయ నీటి సరఫరాకు అవసరమయ్యే ప్రతి పైసాను మిషన్‌భగీరథ పథ కం నుంచే ప్రభుత్వం అందిస్తుందని, పంచాయతీ ల నుంచి ఇందుకోసం ఎలాంటి బిల్లులు చెల్లించా ల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమావేశం లో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌నంద లాల్‌పవార్‌, ఎస్‌ఈ వెంకట రమణ, ఈఈ వెంకటరెడ్డి,   కమిషనర్లు, ఈఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీఎంహెచ్‌వో పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T09:05:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising