ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం నిద్ర మత్తు వీడాలి

ABN, First Publish Date - 2020-07-01T11:14:22+05:30

కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తు వీడాలని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి జిల్లెల చిన్నారెడ్డి


వనపర్తి టౌన్‌, జూన్‌ 30: కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రమత్తు వీడాలని మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కరోనా టెస్టులు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.  దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు ఆమోద యోగ్యంగా లేదన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రోజూ వేలసంఖ్యలో పరీక్షలు చేస్తుంటే తెలంగాణలో టెస్టులు, నిర్ధారణ, మరణాల విషయంలో ప్రభుత్వం దాగుడుమూతలు అడుతోందని విమర్శించారు. గచ్చి బౌలి స్టేడి యంలో నూతనంగా ఏర్పాటుచేసిన కరోనా ఆస్పత్రిలో ఇప్పటికీ ఎలాంటి సదుపాయాలు సమకూర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో  కరెంటు బి ల్లులను పట్టుకుంటేనే షాక్‌ కొడుతున్నాయని అందుకు నిరసనగా జులై 3న జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.  ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, కౌన్సిలర్లు రాధాకృష్ణ,  కోట్ల రవి, అనీష్‌, సతీష్‌యాదవ్‌, వేణాచారి, గంధం కొండలయ్య, డి వెంకటేష్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


విద్యార్థినికి ఘన సన్మానం  

ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని  పూజశ్రీని మాజీ మంత్రి చిన్నారెడ్డి శాలువతో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఆయన వెంట అసెంబ్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోట్ల రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, పట్టణ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, చీర్ల జనార్ధన్‌, కృష్ణవర్ధన్‌రెడ్డి, డి వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-01T11:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising