39 శాతం విద్యార్థుల సౌకర్యాలు కరువు
ABN, First Publish Date - 2020-08-22T10:53:50+05:30
జిల్లాలో ఆన్‌లైన్ తరగతులను వినేందుకు 39 శాతం మంది విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేవని తేలింది
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 21: జిల్లాలో ఆన్‌లైన్ తరగతులను వినేందుకు 39 శాతం మంది విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేవని తేలింది. జిల్లా విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. కరోనా నేపథ్యంలో జిల్లాలోని 803 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మూడు నుంచి పదో తరగతి వరకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహించేందుకు అవసరమైన వివరాలు సేకరించింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 59,792 మంది విద్యార్థులు చదువుతుండగా, 34,467 మంది విద్యార్థులకు మాత్రమే స్మార్ట్‌ఫోన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయని తెలిసింది. 61 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు వినేందుకు సౌకర్యాలు ఉండగా, 23,145 మంది విద్యార్థులకు సౌకర్యాలు లేవని తేలింది. దీనిపై డీఈఓ ఉషారాణిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు వినేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లోని వార్డుల్లో టీవీల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Updated Date - 2020-08-22T10:53:50+05:30 IST