ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరస్‌ పంజా

ABN, First Publish Date - 2020-08-12T10:27:43+05:30

కరోనా వైరస్‌ ప్రజలను భయాం దోళనలకు గురి చేస్తోంది. ఉమ్మడి పాలమూరులో ప్రతి రోజూ వందల సంఖ్యలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగుళాంబ గద్వాల జిల్లాలో కరోనాతో నలుగురి మృతి 

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 272 మందికి వైరస్‌


మహబూబ్‌నగర్‌/వనపర్తి (వైద్యవిభాగం)/జడ్చర్ల/ గద్వాల క్రైం/ అయిజ/ నారాయణపేట క్రైం/ నాగర్‌క ర్నూల్‌, ఆగస్టు 11 : కరోనా వైరస్‌ ప్రజలను భయాం దోళనలకు గురి చేస్తోంది. ఉమ్మడి పాలమూరులో ప్రతి రోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవు తుండగా, మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉ మ్మడి జిల్లాలో మంగళవారం 272 మందికి కొత్తగా కరో నా సోకగా, జోగుళాంబ గద్వాల జిల్లాలో వైరస్‌ బారిన పడి నలుగురి మృతి చెందారు. 


మహబూబ్‌నగర్‌ జిల్లాలో 68 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలో 37 మందికి వైరస్‌ సోకింది. జడ్చర్లలో ఐదు, బాదేపల్లిలో ఐదు, లింగంపేటలో ఒకే ఇంట్లో నలుగురికి కరోనా వచ్చింది. మిడ్జిల్‌లో ఒకటి, కోయిల్‌కొండ మం డలం ఇబ్రహీంనగర్‌లో ఒకటి, అడ్డాకుల మండలంలోని నిజాలాపూర్‌లో మూడు, భూత్పూర్‌లో నాలుగు, గో ప్లాపూర్‌లో ఒకటి, తాటికొండలో ఒకటి, దేవరకద్రలో ఒ కటి కేసులు నమోదయ్యాయి. గండీడు మండలం కంచ నపల్లిలో ఒకటి, నవాబ్‌పేట మండలంలోని చెనగడ్డ తండాలో ఒకటి, ఎర్రవడ్కతండాలో ఒకటి, దరిపల్లిలో ఒకటి, రేకులచౌ డాపూర్‌లో ఒక పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 


జోగుళాంబ గద్వాల జి ల్లాలో మంగళవారం 105 కరోనా కేసులు నమో దు అయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోవిడ్‌, ర్యాపిడ్‌ ల్యాబ్‌లలో నిర్వహించిన పరీక్షల్లో 26 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇందులో గద్వాల పట్టణంలోనే 16 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు ధరూర్‌లో ఒకటి, నీలిపల్లిలో ఒకటి, భీంపురంలో ఒకటి, పూడు రులో ఒకటి, టి.గార్లపాడులో ఒకటి, చెనిగోనిపల్లిలో ఒ కటి, ఽఉండవల్లిలో రెండు, బీరెల్లిలో ఒకటి, శాంతినగర్‌ లో ఒకటి కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఉప్పే రులో ఎనమిది, ఽగట్టులో ఎనమిది, మల్దకల్‌లో మూడు, ఇటిక్యాలలో మూడు, మానోపాడులో 14, అయిజలో 19, రాజోలిలో మూడు, అలంపూర్‌లో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 43 మంది కరోనా బారిన పడ్డారు. అందులో జిల్లా కేంద్రంలో ఏడుగురికి వైరస్‌ సోకగా, కల్వకుర్తి మండలంలో ఎనిమిది మందికి, కొ ల్లాపూర్‌ మండలంలో ఎనిమిది మందికి పాజిటివ్‌ ని ర్ధారణ అయ్యింది. తెలకపల్లి మండలంలో నాలుగు కేసు లు నమోదవగా, మిగతా మండలాల్లో ఒకటి, రెండు చొప్పున కేసులు వచ్చాయి. 


వనపర్తి జిల్లాలో 43 మందికి కరోనా సోకింది. వనపర్తి మండలంలో 24, కొత్తకోటలో నాలుగు, మదనా పూర్‌లో మూడు, పెబ్బేరులో ఐదు, గోపాల్‌పేటలో రెండు కేసులు నమోదయ్యాయి. పాన్‌గల్‌లో ఇద్దరికి, వీపనగండ్లలో ఒకరికి, పెద్ద మందడిలో ఒకరికి, గణపూర్‌లో ఒకరికి వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 


నారాయణపేట జిల్లా వ్యాప్తం గా మంగళవారం 13 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దామరగిద్ద, నర్వ, మద్దూ ర్‌, మరికల్‌, శేర్నపల్లి గ్రామంలో ఒక్కొక్కరి చొ ప్పున కరోనా వైరస్‌ సోకింది. అలాగే నారాయణపేట జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌లో ఇద్దరికి, సరాఫ్‌ బజార్‌లో ఒకరికి, మండలంలోని కోటకొండలో ఇద్దరికి, ఊట్కూరులో మరో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. మాగనూరు మండలంలోని ఎలన్‌పల్లిలో మరొకరికి కరోనా వైరస్‌ సోకింది.


కరోనాతో నలుగురి మృతి

  • జోగుళాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం కరోనాతో మృతి చెందాడు. అలాగే అయిజ పట్టణానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున చనిపోయారు. 
  • చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
  • అలంపూర్‌ మండలం ఇమాంపురం గ్రామానికి చెందిన మహిళ(58) జిల్లా కేంద్రంలోని కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతూ చనిపోయారు.

Updated Date - 2020-08-12T10:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising