ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక ఘట్టాలకు వేదిక

ABN, First Publish Date - 2020-12-30T04:30:20+05:30

2020 ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది.

అర్బన్‌ పార్క్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్‌, ఈటల, శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బల్దియా, సహకార ఎన్నికల్లో ఎగిరిన గులాబీ జెండా 

- ఫిబ్రవరి, జూలైలో మంత్రి కేటీఆర్‌ పాలమూరు పర్యటన 

- రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ప్రతిపక్ష నాయకులు డీకే అరుణ, రేవంత్‌రెడ్డి

- ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కాంగ్రెస్‌, బీజేపీ 

- కొవిడ్‌-19 నిబంధనలతో జరిగిన తుంగభద్ర పుష్కరాలు 

- కరోనా ఎఫెక్ట్‌తో నిధులు లేక స్తబ్దుగా సాగుతున్న ‘పాలమూరు’ పనులు


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : 2020 ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన బల్దియా, సహకార ఎన్నికల్లో విజయాలతో రాజకీయంగా టీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కొనసాగించింది.. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రెండేళ్ల తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు మెల్లగా తేరుకొని ప్రజాక్షేత్రంలోకి రావడం మొదలైంది.. రెండు జాతీయ పార్టీల్లో పాలమూరు నాయకులు రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి రావడంతో, భవిష్యత్‌లో ఉమ్మడి జిల్లాలో కీలక రాజకీయ పరిణామాలకు 2020 పునాది వేసినట్లైంది..


టీఆర్‌ఎస్‌ విజయ పరంపరం


మునిసిపల్‌, సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ పరంపర ఉమ్మడి జి ల్లాలో కొనసాగించింది. మొత్తం 17 బల్దియాల్లో 15 చోట్ల చైర్మన్‌ పీఠాలను ద క్కించుకోగా, మక్తల్‌లో బీజేపీ, వడ్డేపల్లిలో కాంగ్రెస్‌ చైర్మన్‌ స్థానాలను ద క్కించుకున్నాయి. సహకార ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఇదే ఒరవడి కొన సాగింది. మొత్తం 87 పీఏసీఎస్‌లకు గాను 80 సొసైటీల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మూడు, బీజేపీ ఒకటి, ఫార్వర్డ్‌బ్లాక్‌ ఒక సొసైటీ దక్కించుకోగా, రెండు సొసైటీ ల్లో స్వతంత్రులు గెలుపొందారు. 


పోతిరెడ్డిపాడుపై రగడ

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యురేటర్‌ సామర్థ్యం పెంపుతో పాటు రాయలసీమ లిఫ్టు నిర్మాణం జీవోని ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం, సాగునీటి రంగంలో పాలమూరుకు చేదు అనుభవం. ఈ పథకాలు అమల్లోకి వస్తే పాలమూరు ఎ త్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిలభ్యత తగ్గుతుందని, తద్వారా పాలమూరు మరోసారి ఎడారయ్యే అవకాశముందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.


భారత్‌ బంద్‌కు మద్దతు

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అధికారంలోకి వచ్చాక మొదటిసా రి టీఆర్‌ఎస్‌ భారత్‌ బంద్‌లో పాల్గొంది. డిసెంబర్‌ 8న జరిగిన బంద్‌లో ఆ పార్టీకి చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద రాస్తారోకోలో పాల్గొంటే, శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో రాస్తారోకో చేశారు. కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా బంద్‌ సందర్భంగా రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాయి.


పాలమూరులోనే రెండు పర్యాయాలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఫిబ్రవరి 24న మహబూబ్‌నగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరును ఇండోర్‌ నగరంలా మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత జూలై 13న మరోసారి మహబూబ్‌నగర్‌లో పర్యటిం చారు. మెడికల్‌ కాలేజీ భవనాలు ప్రారంభించడంతో పాటు దేశంలోనే అతి పెద్దదైన మయూరి ఎకోపార్కు బోర్డుని ఆవిష్కరించడంతో పాటు, పట్టణంలోని ఎర్రమన్నుగుట్టలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీ (కేటీఆర్‌ కాలనీ)ని ఆయన ప్రారంభించారు.


కాంగ్రెస్‌ ఆందోళన బాట

రెండో సారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కకావికలమైన కాంగ్రెస్‌ 2020లో నెమ్మదిగా తేరుకుంది, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, కృష్ణాజలాల్లో పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై మే 27న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కు టమార్‌ మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేష న్‌ ఇచ్చారు. 


సంతకాల సేకరణ

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కాంగ్రెస్‌ చే పట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నవంబర్‌ 3న మహబూబ్‌న గర్‌ మండలం కోటకదిరలో పీసీసీ ఇన్‌చార్జి, తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూరు ప్రారంభించారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ ఒకటిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఉమ్మడి జిల్లాలో ఆసుపత్రులను సందర్శించారు. ఈ పర్యటనలో వెలుగులోకి వచ్చిన అంశాలనే ఆయన ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించి, ప్రభుత్వాన్ని నిలదీశారు.


రెండు విషాద ఘటనలకు సాక్ష్యం

రాష్ట్రానికే తలమానికమైన శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో ఆగస్టు 21న అగ్ని ప్రమాదం జరిగి పవర్‌హౌజ్‌ బుగ్గయ్యింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సిబ్బంది దుర్మరణం పాలవడం షాక్‌ను మిగల్చింది. రాజకీయ యుద్ధానికి ఈ దుర్ఘటన తెరలేపింది. అలాగే అక్టోబర్‌ 16న ఉమ్మడి జిల్లాకు తాగు, సాగునీటి ఆధారమైన కల్వకుర్తి ఎత్తిపోతతల పథకం మొదటి పంపు హౌస్‌ నీట మునిగిపోయింది. ఈ రెండు ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమి ప్రతిపక్షాలు బలంగా ఆరోపించాయి. 


చక్రం తిప్పుతున్న నాయకులు

టీఆర్‌ఎస్‌ని రాజకీయంగా ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్‌, బీజేపీల్లో రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరి స్తున్న ఉమ్మడి నాయకులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత టీఆర్‌ఎస్‌పై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాం గ్రెస్‌లో జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి కీలకస్థాయికి ఎదిగారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకనపెట్టే పలు సంచలనాలను ఈ ఏడాది ఆవిష్కరించారు. తాజాగా పీసీసీ అధ్యక్ష పదవికి కీలక పోటీదారుగా నిలిచారు.


పాలమూరుపై బీజేపీ ఫోకస్‌

తెలంగాణలో పాగా వేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ ఉమ్మడి జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పె ట్టింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను నియమించగా, రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షుడిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కోశాఽధికారిగా శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా బంగారు శ్రుతి, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా అప్సర్‌ఖాన్‌ను నియమించింది. అలాగే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని దుబ్బాక ఎన్నికల ఇన్‌ చార్జిగా నియమించగా, అక్కడ పార్టీ విజయానికి ఆయన వ్యూహాలు దోహద పడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నిక ల్లోనూ పాలమూరు బీజేపీ నాయకులు చక్రం తిప్పారు.


కలగానే మిగిలింది

మహబూబ్‌నగర్‌, భూత్పూర్‌, జడ్చర్ల బల్దియాలతో పాటు సమీప తొమ్మిది మండ లాల పరిధితో ఏర్పాటు చేయాలని కోరిన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పట్టాలెక్క లేదు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, ఇద్దరు ఎమ్మెల్యేలు స్వయంగా సీఎం కేసీఆర్‌ని కలిసి ఈ ప్రతిపాదనలు చేసినా, కార్యరూపం దాల్చలేదు.


అస్తమించిన మాతా మాణికేశ్వరం


భక్తులు అమితంగా ఆరాధించే మాతా మాణికేశ్వరి ఈ ఏడాది మార్చి 7న అస్తమిం చారు. కర్ణాటక రాష్ట్రం యానగుందిలోని సూర్యనంది క్షేత్రం వద్ద ఉన్న ఆశ్రమ సన్నిధి లోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించగా, రెండు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో కడసారి దర్శనం చేసుకున్నారు.


నామమాత్రంగా జాతరలు

మార్చి 21న జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌తో ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో జాతరలు కళతప్పాయి. గ్రామ, స్థానిక జాతరలు నామమాత్రంగా జరిగాయి. ప్రతిష్ఠా త్మకంగా జరిగే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి జాతర సైతం కేవలం బ్రహ్మోత్సవాలకే పరిమితమైంది.


తుంగభద్ర పుష్కరాలు విజయవంతం

తుంగభద్ర పుష్కరాలు నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ ఒకటి వర కు కొనసాగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి ని రంజన్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పుష్కర స్నానం చేసి పుష్కరాలు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో అలంపూర్‌తో పాటు మరో నాలుగు ఘాట్ల వద్దనే పుష్కర స్నానాలకు అనుమతించారు. కరోనా భయంతో భక్తులు సైతం పెద్దగా రా కపోవడంతో పుష్కరఘట్టం ప్రశాంతంగా ముగిసింది.


నత్తనడకన ‘పాలమూరు’

ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా పేర్కొనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఈ ఏడాది కూడా నత్తనడకన సాగాయి. కరోనా, లాక్‌డౌన్‌, నేపథ్యంలో రాష్టర ప్రభుత్వ ఆర్థిక వనరులు తగ్గిపోవడంతో పథకం పనులు మందగించాయి. బడ్జెట్‌లోనూ పథకానికి నామమాత్రపు నిధుల కేటాయింపే జరిగింది.


వరుస వర్షాలతో నష్టం

ఈ ఏడాది కురిసిన వర్షాలు పాలమూరు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా పత్తి 80 శాతం మేర దెబ్బతినగా, సుమారు రూ.550 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వరి పంట సైతం భారీగా దెబ్బతినగా, గింజ రంగు మారి ధరలు పడని పరిస్థితి ఏర్పడంది. రైతులకు పంట నష్ట పరిహారం కోసం డిమాండ్‌ చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2020 చివరలో రైతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Updated Date - 2020-12-30T04:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising