ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పదిలో ఉత్తీర్ణత రాకుంటే.. ఉపాధ్యాయులపై చర్యలు’

ABN, First Publish Date - 2020-02-20T06:31:54+05:30

పదో తరగతిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. పట్టణంలోని టంగాపూర్‌, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట టౌన్‌ ఫిబ్రవరి 19 : పదో తరగతిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు. పట్టణంలోని టంగాపూర్‌, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనికీ చేశారు. ఉర్దూ మీడియంలో 25మంది విద్యార్థులకు గానూ 8మంది ఉపాధ్యాయులు ఉండగా.. పదో తరగతిలో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని అందుకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలలో రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించటానికి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారి అహ్మద్‌, నారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస చారి పాల్గొన్నారు.

ఇంటర్నల్‌ మార్కులు ఆన్‌లైన్లో నమోదు చేయాలి

నాగర్‌కర్నూల్‌ అర్బన్‌ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల వివరాలను మార్చి 2నుంచి 21వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ ఆన్‌లైన్లో నమోదు చేయాలని డీఈవో గోవిందరాజులు బుధవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన మార్కుల జాబితాను ఎంఈవో పరిశీలించి రెండు సెట్ల ప్రతులను జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. నిర్ధేశించిన గడువులోగా నమోదు చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-02-20T06:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising