ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి: మధుయాష్కి

ABN, First Publish Date - 2020-10-24T23:18:50+05:30

వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి: మధుయాష్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అకాల వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కాంగ్రెస్ నేత మధుయాష్కి డిమాండ్ చేశారు. వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ దాటడం లేదని మండిపడ్డారు. వాతావరణశాఖ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద నష్టం, మృతుల సంఖ్యపై ఇప్పటి వరకు సర్వే చేయలేదని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సాయం చేస్తున్నారని, రూ.10వేల సాయం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులను మిషన్‌ కాకతీయకు మళ్లించారని మధుయాష్కి దుయ్యబట్టారు.


భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు... కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలో అధికారుల బృందం వరద నష్టాన్ని అంచనా వేసింది. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం వివరాలను కేంద్ర బృందానికి అధికారులు అందించారు.  

Updated Date - 2020-10-24T23:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising