ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లివబుల్‌, లవబుల్‌ సిటీలే లక్ష్యం

ABN, First Publish Date - 2020-06-25T08:01:38+05:30

భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా అందించే టీఎస్‌ బీపా్‌సను కేబినెట్‌ ఆమోదం తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రజలకు సకల సౌకర్యాలూ కల్పిస్తాం.. కేబినెట్‌ ఆమోదించాకే టీఎస్‌ బీపాస్‌: కేటీఆర్‌

కరోనా కట్టడిలో తమ శాఖది కీలక పాత్రని వ్యాఖ్య.. 2019-20 వార్షిక ప్రగతి నివేదిక విడుదల


హైదరాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌ ద్వారా పారదర్శకంగా అందించే టీఎస్‌ బీపా్‌సను కేబినెట్‌ ఆమోదం తర్వాత పూర్తి స్థాయిలో అమల్లోకి తెస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుతం టీఎస్‌ బీపాస్‌ కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా కొనసాగుతోందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏ పరిధిలోని పలు చోట్ల డీపీఎంఎస్‌ విధానంలో నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని.. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసి టీఎస్‌ బీపాస్‌ ద్వారా అనుమతులు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక 2019-20ను మంత్రి కేటీఆర్‌ బుధవారం విడుదల చేశారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత ఏడాది కాలంగా పురపాలక శాఖ చేపట్టిన కార్యక్రమాల పురోగతిని మంత్రి కేటీఆర్‌ వివరించారు. పట్టణాల రూపురేఖలు మార్చేందుకు నూతన పురపాలక చట్టాన్ని తెచ్చామని, పట్టణ పురోగతిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సకల సౌకర్యాలూ కల్పించడ ం ద్వారా లివబుల్‌, లవబుల్‌ సిటీలుగా మార్చాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ కట్టడి కార్యక్రమాల్లో పురపాలక శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి మునిసిపల్‌ పారిశుధ్య విభాగం, విపత్తు సహాయక నిర్వహణ, నీటి సరఫరా వంటి అంశాల్లో 24 గంటల పాటు ప్రణాళికబద్ధంగా పని చేసిందని చెప్పారు. సుమారు 1.25 లక్షల మందికి ఉచిత భోజనాన్ని అందించిందన్నారు. వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఇతర శాఖలతో పురపాలక శాఖ సమన్వయం చేసుకుని పని చేసిందన్నారు. ఇదే సమయంలో నగరాలు, పట్టణాల్లో రోడ్లు, ఫ్లై ఓవర్‌ల నిర్మాణం వంటి పనులను వేగంగా పూర్తి చేసిందని చెప్పారు.  కాగా కరోనా సంక్షోభం సందర్భంగా హైదరాబాద్‌లో పారిశుధ్య కార్యక్రమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో జరిగేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ద్వారా సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు వాహనాలను సమకూర్చామని, తద్వారా దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పామని చెప్పారు.


ప్రగతి నివేదికలోని మరికొన్ని అంశాలు

పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంతో కొత్త మునిసిపాలిటీల ఏర్పాటు. 

టీయూఎ్‌ఫఐడీసీ ద్వారా 110 మునిసిపాలిటీల్లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు.

మెట్రో రైలు ప్రాజెక్టు 69 కిలోమీటర్ల మేర పూర్తి. 

పట్టణ పేదల కోసం అదనంగా 45 కొత్త బస్తీ దవాఖానాలు ప్రారంభం.

హైదరాబాద్‌తోపాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 24 పట్టణ స్థానిక సంస్థలు, 18 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తూ రూ.725 కోట్ల విలువతో తాగు నీటి  ప్రాజెక్టు పూర్తి. 


Updated Date - 2020-06-25T08:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising