ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సాహితీలోకం మద్దతు

ABN, First Publish Date - 2020-12-20T08:23:50+05:30

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి సాహితీలోకం మద్దతు తెలిపింది. అన్నదాతల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు కవులు, రచయితల కవితా గోష్ఠి 

అఖిల భారత రైతుల పోరాటానికి సంఘీభావం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు19 (ఆంధ్రజ్యోతి): కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి సాహితీలోకం మద్దతు తెలిపింది. అన్నదాతల పోరాటానికి సంఘీభావంగా ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ‘‘అన్నంమెతుకు రుణం తీర్చుకొనేందుకు భరోసా కవిత్వ గీతాలాపన’’ పేరుతో కవితా గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో ప్రముఖ కవులు, రచయితలతో పాటు వర్ధమాన, యువ కవులు, సాహితీ అభిమానులు పాల్గొననున్నారు


. తెలంగాణ రచయితల వేదిక, సింగిడి తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ సాహితీ, కవి సంగమం, హర్యాలి ముస్లిం రచయితల వేదిక, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజాస్వామిక రచయితల వేదిక, బహుజన రచయితల సంఘం, ఎరుక సాహితీ సంస్థ, బహుజన సాంస్కృతిక వేదిక, ఫూలే అంబేడ్కర్‌ అధ్యయన వేదిక, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక, తెలంగాణ చైతన్య సాహితీ, బహుజన సాహిత్య కచ్చీరు, బహుజన రచయితల వేదిక, తెలంగాణ సామాజిక రచయితల సంఘం తదితర సంస్థలు ‘‘హలాలకు కలాల మద్దతు’’ కవితా గోష్ఠిలో భాగస్వామ్యమయ్యాయి.


Updated Date - 2020-12-20T08:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising