ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు గుర్తు, కేసీఆర్‌తోనే గెలుపొందాం..

ABN, First Publish Date - 2020-09-14T10:56:55+05:30

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌లు కారు గుర్తు, సీఎం కేసీఆర్‌ తోనే గెలిచామని కార్పొరేటర్‌ బైరబోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కార్పొరేటర్లు


కరీమాబాద్‌, సెప్టెంబరు 13 : గ్రేటర్‌ వరంగల్‌  కార్పొరేషన్‌ పరిధిలోని టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌లు కారు గుర్తు, సీఎం కేసీఆర్‌ తోనే గెలిచామని కార్పొరేటర్‌ బైరబోయిన దామోదర్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో తూర్పు  కార్పొరేటర్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కార్పొరేటర్‌ దామోదర్‌ యాదవ్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అంటేనే ఒక ఐరన్‌ లెగ్‌ అని ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమేనని అన్నారు. రెండు రోజుల క్రితం తూర్పులో పర్యటించిన కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ల గెలుపు విషయమై అనుచిత వాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.


2014 లో ఆమె గెలుపుకోసం పని చేసిన కార్పొరేటర్లను తమ కాళ్లు మొక్కితేనే కార్పొరేటర్‌లుగా గెలిపించామని అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  ఒక మహిళ అయి ఉండి సాటి మహిళ కార్పొరేటర్‌లను కించపరిచేలా మాట్లాడటం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికలప్పుడు తప్ప నీకు ప్రజలు గుర్తుకురారని కరోనా సమయంలో ప్రజల కోసం ఎమ్మెల్యే నరేందర్‌ కృషి చేశారనీ, మీరు మాత్రం ఇంట్లో ఉండి ఇప్పుడు  ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కొత్త వేశాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఔట్‌డేటెడ్‌ ప్రజాదరణ లేని నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని గుర్తు చేశారు.

 

మళ్లీ అదే బెదిరింపులు, గుండాయిజం, చిల్లర మాటలు మాట్లాడితే ఎవరూ సహించరని బానిసత్వానికి రోజులు చెల్లాయని మీకు ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్పొరేటర్‌లు ఎలగం లీలావతి మాట్లాడుతూ సాటి మహిళ అయి ఉండి మహిళ కార్పొరేటర్‌లు అని చూడకుండా కొండా సురేఖ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు.   కార్పొరేటర్‌ బయ్యస్వామి, టీఆర్‌ఎస్‌ నాయకుడు మసూద్‌లు  మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.  

Updated Date - 2020-09-14T10:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising